కొత్త ఏర్పాటుకు వేగంగా పావులు కదుపుతున్న తలైవా

Submitted by arun on Tue, 01/02/2018 - 10:59
Rajinikanth

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొత్త పార్టీ ఏర్పాటుకు వేగంగా పావులు కదుపుతున్నారు. సంక్రాంతి పండగకు కొత్త పార్టీని ప్రారంభించేలా తలైవా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త పార్టీ గుర్తు, సిద్ధాంతాలను త్వరలోనే వెల్లడిస్తామంటూ రజనీకాంత్‌ సోదరుడు సత్యనారాయణరావు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో తలైవా పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందన్నారు.

సంక్రాంతి రోజున పార్టీ పేరు, గుర్తు సిద్ధాంతాలను వెల్లడిస్తారన్న వార్తను రజనీ సోదరుడు సత్యనారాయణరావు ధృవీకరించారు. రాజకీయాల్లో తిరుగులేని విజయాలు సాధించి, ప్రజలకు మెరుగైన సేవలందించే సత్తా తన సోదరుడికి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గుర్తుగా బాబా సినిమాలోని కుడి చేతిలోని చూపుడు వేలు, చిటికెన వేళ్లు పైకి చూపే స్టైల్‌నే సింబల్గా ఖరారు చేసే అవకాశముంది. 
 
పార్టీ సభ్యత్వ నమోదు కోసం జనవరి 1న కొత్తగా వెబ్‌సైట్‌ను రజనీకాంత్‌ ప్రారంభించారు. వెబ్‌సైట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ట్విట్టర్‌లో ఒక వీడియో విడుదల చేశారు. రిజిస్టర్‌ అయిన అభిమాన సంఘాలు, రిజిస్టర్‌ కాని సంఘాల అభిమానులు, మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రజల నుంచి సభ్యత్వ నమోదును ఆహ్వానిస్తున్నామని తెలిపారు. వెబ్‌సైట్‌లో పేరు, ఓటరు గుర్తింపు కార్డు నెంబరును నమోదు చేసి సభ్యులుగా చేరవచ్చన్నారు.

English Title
Rajinikanth launch of new website

MORE FROM AUTHOR

RELATED ARTICLES