రాహుల్‌ ఫ్యూచర్‌‌పై సోనియా కీలక వ్యాఖ‌్యలు

Submitted by arun on Fri, 03/09/2018 - 17:14
sonia gandhi rahul gandhi

ఏఐసీసీ పగ్గాలను తనయుడికి అప్పగించి కాంగ్రెస్‌ వ్యవహారాల్లో తన పాత్రను తగ్గించుకున్న సోనియాగాంధీ పార్టీని నడపడంపై రాహుల్‌కి కొన్ని విలువైన సూచనలు చేశారు. ప్రజలతో కనెక్ట్‌ కావడానికి కొత్త స్టైయిల్‌ను డెవలప్‌ చేసుకోవాలన్నారు. ట్రెండ్‌కి తగ్గట్టుగా ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి కొత్త స్టైయిల్‌ కావాలన్నారు. పార్టీ వ్యవస్థీకృత స్థాయిలోనే ఈ మార్పు జరగాలన్నారు. 

రాహుల్‌కి సలహాలిచ్చే ప్రయత్నం చేయబోనన్న సోనియాగాంధీ కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు చేరువయ్యేందుకు మాత్రం నూతన శైలిని ఎంచుకోవాల్సిన అవసరమైతే కచ్చితంగా ఉందన్నారు. పార్టీకి నూతన జవసత్వాలు తేవడానికి యువ నేతలు, సీనియర్లతో సమతుల్యత సాధించాలన్నారు. ఓవరాల్‌గా రాహు‌ల్‌గాంధీ ఇంకా ప్రజల మద్దతు పొందాల్సిన కూడగట్టుకోవాల్సిన అవసరముందన్నారు. ఇక ప్రియాంక గురించి కూడా మాట్లాడిన సోనియాగాంధీ ఆమె ప్రస్తుతం తన పిల్లల బాధ్యతల్లో బిజీగా ఉందన్నారు, అయితే భవిష్యత్‌ ఎలాగుంటుంటో ఎవరు చెప్పగలరన్నారు.

English Title
Rahul wants a balance of young and senior leaders and this is not an easy task: Sonia

MORE FROM AUTHOR

RELATED ARTICLES