మట్టిలో మాణిక్యం...‘చెత్త’ కుటుంబం నుంచి ఎయిమ్స్‌కు

మట్టిలో మాణిక్యం...‘చెత్త’ కుటుంబం నుంచి ఎయిమ్స్‌కు
x
Highlights

విద్యకు పేదరికం అడ్డు కాదని నిరూపించాడు ఓ నిరుపేద విద్యార్ధి.. ఎయిమ్స్ ప్రవేశపరీక్షలో జాతీయ స్థాయిలో 141వ ర్యాంక్ తో పాటు నీట్ లో 803వ ర్యాంకును సొంతం...

విద్యకు పేదరికం అడ్డు కాదని నిరూపించాడు ఓ నిరుపేద విద్యార్ధి.. ఎయిమ్స్ ప్రవేశపరీక్షలో జాతీయ స్థాయిలో 141వ ర్యాంక్ తో పాటు నీట్ లో 803వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఈ విద్యార్ధి చెత్త ఏరుకునే వ్యక్తి కొడుకు...పేరు ఆశారాం చౌదరి..సొంతూరు మధ్యప్రదేశ్ లోని దేవాన్ గ్రామం. ఎంతో దర్భరమైన పరిస్థితులతో ఆశారం కుటుంబం జీవనం కొనసాగిస్తున్నారు. అయినా ఏనాడు కుంగిపోలేదు పట్టుదలతో విద్యలో ముందడుగు వేశాడు. తొలి ప్రయత్నంలోనే అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ ఎయిమ్స్ లో ఓబీసీ కేటగిరిలో జాతీయ స్థాయిలో 141వ ర్యాంకుతో పాటు నీట్ లో 803 ర్యాంకును సాధించాడు. ఆశారాం తమ్ముడు12వ తరగతి, చెల్లెలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు.

ఎయిమ్స్‌లో సీటు రావడంతో తనకు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందన్నాడు ఆశారాం. ‘మా నాన్న చెత్త ఏరుకుంటూ, ఎన్నో కష్టాలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తూ చదివిపించారని చెప్పుకొచ్చాడు. మేం నివసిస్తున్న ఇంటికి విద్యుత్తు కనెక్షన్‌గానీ, మరుగుదొడ్డిగానీ లేదని తన కుటుంబ దుర్భర పరిస్థితిని వివరించాడు ఆశారాం. న్యూరాలజిస్టు కావాలన్నదే తన లక్ష్యమమని చెప్పాడు. తాను విద్యలో ఈ స్థాయికి రావడానికి మా ఊరు వైద్యుడు దుర్గా శంకర్ కుమావత్ ఎంతో సాయం చేశాడని ఆయనే తన హీరో అని వివరించారు. సొంతఊరిలోనే వైద్యశాల ప్రారంభించి ప్రజలకు మంచి వైద్యం అందిస్తానని చెప్పాడు ఆశారాం.

చెత్త ఏరుకునే వ్యక్తి కొడుకు ఆశారాం ఎన్నో కష్టాలు ఎదుర్కొని మొదటి ప్రయత్నంలోనే ప్రతిష్టాత్మక ఎయిమ్స్ లో సీటు సాధించడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆశారాంను అభినందిస్తూ ఓ లేఖ రాశారు పట్టుదలతో ఎయిమ్స్ ప్రవేశపరీక్షలో పాస్ కావడం గొప్ప విషయమన్నారు. ఆశారాం సాధించిన విజయం తల్లిదండ్రుల అంకిత భావాన్ని ప్రతిఫలిస్తుందన్నారు. దేవాన్ గ్రామవైద్యుడి మాదిరిగా ఆశారాం ఎందరికో స్ఫూర్తి ప్రదాత కావాలని ఆకాంక్షించారు.

మధ్యప్రదేశ్ సీఎంశివరాజ్ సింగ్ చౌహాన్ ఆశారాంను పిలిచి అభినందించారు. ఆశారాం వైద్యవిద్యకు అయ్యే ఖర్చుమొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. తొలి సహాయంగా 25 వేల రూపాయలు నగదు అందజేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఆశారాం ఎంబీబీఎస్ లో చేరేందుకు వెళ్లిన ఆశారాంకు తోడుగా ప్రభుత్వం ఓ అధికారిని పంపించింది. ఆశారాం వైద్యవిద్య పూర్తి చేసి ప్రముఖ వైద్యుడిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు దేవాన్ గ్రామస్తులు.

Show Full Article
Print Article
Next Story
More Stories