వైసీపీలో ముసలం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాధా..

Submitted by nanireddy on Mon, 09/17/2018 - 08:44
radha quit ycp vanijya meeting

విజయవాడ వైసీపీలో ముసలం మొదలయింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధా మళ్ళి అలకబూనారు. తనకు కాకుండా మల్లాది విష్ణుకి టికెట్ సంకేతాలు రావడంతో అయన సమావేశం మధ్యలోనుంచి వెళ్లిపోయారు. నిన్న(ఆదివారం) విజయవాడలో వైసీపీ వాణిజ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కృష్ణా జిల్లా ఇంచార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్ధసారధి, వంగవీటి రాధ, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, యలమంచిలి రవి తదితరులు హాజరయ్యారు. ఇవాళ్టి నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమం జరగనుంది. రావాలి జగన్, కావలి జగన్ పేరుతో నేతలు ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంది. దీనిపై చర్చించేందుకే నిన్న వాణిజ్య సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో మల్లాది విష్ణును కూడా  గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనమని చెప్పడంతో అయన కూడా టికెట్ రేసులో వున్నాడన్న అనుమానం  రాధాలో మొదలైంది. మొదటి నుంచి విజయవాడ సెంట్రల్ టికెట్ తనకే అని భావిస్తున్న రాధా ఈ పరిణామంతో మళ్ళి  అయన శిభిరంలో అలజడి మొదలైంది. దీంతో అధిష్టానంపై అలిగి మధ్యలోనే వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. 

English Title
radha quit ycp vanijya meeting

MORE FROM AUTHOR

RELATED ARTICLES