పెళ్లి గురించి ప్రభాస్ క్లారిటీ

Submitted by arun on Wed, 01/03/2018 - 12:42
prabhas

ప్ర‌భాస్ పెళ్లి వ్య‌వ‌హారంపై రోజుకో రూమ‌ర్ నెట్టింట్లో హడావిడి చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో భీమ‌వ‌రానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకుంటార‌ని వార్త‌లు రాగా..అదేంలేద‌ని పెద్ద‌నాన్న కృష్ణంరాజు కొట్టిపారేశారు. ఆ త‌రువాత‌ హీరోయిన్ అనుష్క‌ను వివాహం చేసుకుంటార‌ని ఇలాపుకారు షికార్లు చేశాయి. ఈనేప‌థ్యంలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ త‌న పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ అనుష్క‌ను ప్రేమిస్తున్నార‌నే  ఓ మ్యాగ‌జైన్ ఇంట‌ర్వ్యూలో  ఒకే జంట వ‌రుస సినిమాలు చేస్తే ఇలాంటి రూమ‌ర్లు రావ‌డం కామ‌న్ అని అన్నారు.

అనుష్క త‌న‌కు మంచి స్నేహితురాల‌ని చెప్పుకొచ్చారు. త‌మ‌పై వ‌చ్చే రూమ‌ర్ల‌కు అర్ధం లేద‌ని.. అనుష్క ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని కుండ బద్దలు కొట్టేసాడు. అంతేకాదు ప్రభాస్ ఈ సంవత్సరం కూడా తన పెళ్లి లేదని తేల్చేసాడు. ఎవ‌రినైనా ప్రేమిస్తున్నారా అంటే  ఏదైనా ఉంటే తానే చెప్పేవాడిని అని లేని గర్ల్ ఫ్రెండ్ ని ఎక్కడి నుంచి తెమ్మంటారు అని  ప్రభాస్ ప్రశ్నించడం కొస‌మెరుపు. ప్ర‌భాస్ వ్యాఖ్య‌ల‌తో  పెళ్లిపై ఇక‌నైనా రూమ‌ర్లు ఆగుతాయో లేదో చూడాలి మ‌రి.  కాగా ప్ర‌భాస్ ప్ర‌స్తుతం యాక్ష‌న్ ఫిల్మిం సాహో లో న‌టిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతుండా..త్వ‌ర‌లో యాక్ష‌న్ ఎపిసోడ్స్ ను దూబాయ్ లో చిత్రీక‌రించ‌నున్నారు. 

English Title
rabhas Gives Clarity on his Marriage

MORE FROM AUTHOR

RELATED ARTICLES