ఊహించని షాక్‌ : నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

Submitted by arun on Fri, 01/19/2018 - 15:44
pradeep

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ యాంకర్ ప్రదీప్ కు నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ప్రదీప్ ‌...డ్రైవింగ్ లైసెన్స్ ను మూడేళ్ల పాటు రద్దు చేసింది. అంతేకాక ప్రదీప్‌కు రెండు వేల ఒక వంద రూపాయల జరిమానా విధించింది. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు విచారణ నిమిత్తం  ప్రదీప్‌ నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. ఈ కేసును విచారించిన కోర్టు...  ప్రదీప్ డ్రెవింగ్ లైసెన్స్ రద్దుతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. 

గత ఏడాది డిసెంబర్ 31 రాత్రి  న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా...యాంకర్ ప్రదీప్ మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. బ్రీత్‌ అనలైజర్‌లో 178 పాయింట్లు చూపించండంతో... పోలీసులు ప్రదీప్ కారును సీజ్ చేసి.. కేసు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా ప్రదీప్ జనవరి ఎనిమిదో తేదిన తన తండ్రితో కలిసి గోషామహల్‌లోని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు హాజరయ్యాడు.

ప్రదీప్ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసును నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణకు తండ్రితో కలిసి ప్రదీప్ హాజరయ్యాడు. తెలిసి ఎలా తప్పు చేశారని కోర్టు.. ప్రదీప్ ను ప్రశ్నించింది. తప్పు జరిగిపోయిందని ప్రదీప్ అంగీకరించాడు. ఈ కేసును విచారించిన కోర్టు...ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడేళ్ల పాటు రద్దు చేసింది. అంతేకాక ప్రదీప్‌కు రెండు వేల ఒక వంద రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. 

 
 

English Title
pradeep driving licence cancelled 3 years

MORE FROM AUTHOR

RELATED ARTICLES