బాలీవుడ్ స్టార్ హీరో కూతురుతో ప్ర‌భాస్

Submitted by lakshman on Sun, 01/28/2018 - 08:29
Saif Ali Khan's daughter Sara Ali Khan

బాహుబ‌లితో ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించిన రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం యూవీ క్రియేష‌న్స్ పతాకంపై, సుజిత్ డైర‌క్ట‌న్ లో  సాహో అనే యాక్ష‌న్ లో యాక్ట్ చేస్తున్నారు.ఈ సినిమా నిర్మాణం చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా జిల్ డైర‌క్ట‌ర్ రాధాకృష్ణ తో మ‌రో సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అయితే బాహుబ‌లి త‌రువాత ప్ర‌భాస్ రేంజ్ ఒక్క‌సారిగా మారిపోయింది. ఏ సినిమా చేయాల‌న్నా భారీ క్యాస్టింగ్ క్రూ ఉండేలా నిర్మాత‌లు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే సాహోలో బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్ర‌ద్ధాక‌పూర్ సెల‌క్ట్ చేసుకున్న విష‌యం తెలిసిందే. మ‌రి రాధాకృష్ణ డైర‌క్ష‌న్ లో వ‌చ్చే కొత్త మూవీ కోసం అదే త‌ర‌హాలో హీరోయిన్ల కోసం జ‌ల్లెడ ప‌ట్టింద‌ట చిత్ర యూనిట్ . ప్ర‌భాస్ రేంజ్ కు త‌గ్గ హీరోయిన్ దొరికినా కాల్షిట్లు అడ్జెస్ట్ చేయ‌లేకపోతున్నార‌ట . ఈనేప‌థ్యంలో  హీరోయిన్ దీపికాను సంప్ర‌దించ‌గా ప‌ద్మావ‌త్ సినిమా అల్ల‌ర్ల గురించి ఆందోళ‌న‌లో ఉన్న‌ట్లు చెప్పింద‌ట‌. మ‌ళ్లీ హీరోయిన్ల కోసం ఇండ‌స్ట్రీల‌ను జ‌ల్లెడ ప‌ట్టిన ద‌ర్శ‌క - నిర్మాత‌లు  ఈ సారి సైఫ్ అలీఖాన్ మొద‌టి భార్య కూత‌రు సారా అలీఖాన్ కు స్టోరీ లైన్ వినిపించార‌ట‌. స్టోరీ బాగుంద‌ని, తాను యాక్ట్ చేసే విష‌యం లో త‌న త‌ల్లి సారా స‌ల‌హా తీసుకోవాల‌ని చెప్పింద‌ట‌.  ఆమె సినిమా కు ఒప్పుకుంటే కొత్త సినిమా చేయాల‌నే ప్ర‌భాస్ ఎదురు చూస్తున్నాడు. అంత అనుకున్నట్టు జరిగితే సారా అతి త్వరలో ప్రభాస్ సరసన మన ముందుకు రావచ్చు.

English Title
prabhas waiting for Sara Ali Khan

MORE FROM AUTHOR

RELATED ARTICLES