కృష్ణంరాజు తో కలిసి ప్రభాస్ దందా

Submitted by arun on Tue, 01/02/2018 - 13:58
pk

రెబల్ స్టార్ ప్రభాస్ దందా మొదలుపెట్టబోతున్నాడా..?అది కూడా పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి. దందా అంటే ఏదో కొత్త వ్యాపారం అనుకుంటే పొరపాటే ఓ సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా పేరే దందా. ప్రస్తుతం సాహో మూవీతో బిజీగా ఉన్న ప్రభాస్.  నెక్ట్స్ దందా సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు.

ప్రభాస్ నెక్ట్స్ సినిమాపై ఓ ఆసక్తికరమై విషయం బయటికి వచ్చింది. ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్న ప్రభాస్ తర్వాత పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి దందా అనే సినిమా చేయబోతున్నాడనే వార్తలు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ హీరోగా సినిమా నిర్మించాలని కృష్ణంరాజు ఎప్పటి నుంచే ట్రై చేస్తున్నాడు. ఒకటి రెండు సార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాడు కూడా. అయితే అది సాహో తర్వాత కుదరబోతున్నట్టు తెలుస్తోంది. కృష్ణంరాజు నిర్మాణ సంస్థ ఐన గోపిక్రిష్ణ బ్యానర్ లో దందా అనే టైటిల్ ను రిజిస్టేషన్ చేయించాడు. దీంతో అది ప్రభాస్ మూవీకే అనే వార్తలు వస్తున్నాయి.

దందా సినిమాను కృష్ణంరాజు నిర్మించడంతో పాటు అతనే మూవీని డైరెక్ట్ చేస్తాడనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తలో వాస్తవం లేదు. కేవలం నిర్మాతగా మాత్రమే సినిమాను నిర్మించనున్నాడట. స్టోరీ నచ్చడంతో వెంటనే ఆ టైటిల్ ను రిజిస్టేషన్ చేయించాడట. దందా మూవీలో కృష్ణంరాజు కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే బిల్లా,రెబల్ మూవీలో కలిసి చేసిన కృష్ణం రాజు, ప్రభాస్ మరోసారి మెరవబోతున్నారు. కాకపోతే ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనేది ఇంక క్లారిటీ లేదు.

సాహో సినిమా తర్వాత ప్రభాస్ నెక్ట్స్ జిల్ డైరెక్టర్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే అది దందా సినిమానేనా లేక మరో మూవీనా అనేది సస్సెన్స్ గా మారింది. ఒకవేళ ఈ రెండు వేరే మూవీస్ అయితే దీనిలో ఏ సినిమాను ముందుగా పట్టాలపైకి తీసుకువస్తాడనేది చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న సాహో మూవీ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. అంటే నవంబర్, డిసెంబర్ లోపు షూటింగ్ కంప్లీట్ అవుతుంది. దీంతో ఈ ఏడాది చివరిలోనే ప్రభాస్ నెక్ట్స్ మూవీ స్టార్ట్ అవుతుంది.

English Title
prabhas danda next movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES