అందంగా ఉందని నిందితురాలితో పోలీసుకానిస్టేబుల్ సెల్ఫీ దిగి...

Submitted by arun on Mon, 12/25/2017 - 10:31
selfie

ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉందని అనుకుంటూ, ఓ నిందితురాలితో సెల్ఫీ దిగటమే కాకుండా, ఆమెను తనతో కలసి టూరుకు రావాలని కోరిన ఓ గుజరాత్ కానిస్టేబుల్ చిక్కుల్లో పడ్డాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, అహ్మదాబాద్ నగరంలోని దరియాపూర్ ప్రాంతానికి చెందిన అమీనా షేక్ (36) అనే మహిళ అక్రమంగా మద్యం బాటిళ్లను కారులో తీసుకువెళుతుండగా మొబైల్ పోలీసులు పట్టుకున్నారు. నిందితురాలైన అమీనా చాలా అందంగా ఉందని పోలీసు కానిస్టేబుల్ శైలేష్ చెబుతూ కారులోనే ఆమెతో సెల్ఫీ తీసుకున్నాడు. ఇంత అందంగా ఉండటానికి ఏం క్రీమ్ రాస్తున్నావు అని కానిస్టేబుల్ శైలేష్ నిందితురాలిని అడిగినట్లు ఏసీపీ బల్దేవ్ దేశాయ్ చెప్పారు. తాను కేసులో నిందితురాలినే అయినా, తన గౌరవానికి భంగం కలిగిందని, దీన్ని సహించేది లేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనపై దర్యాఫ్తు చేస్తున్నామని, కానిస్టేబుల్ తప్పు చేశాడని తేలితే, అతనిపై శాఖా పరమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

English Title
police requested Woman for a selfie

MORE FROM AUTHOR

RELATED ARTICLES