క్షమాపణలు చెప్తున్నా : ప్రధాని నరేంద్రమోడీ

Submitted by nanireddy on Fri, 05/25/2018 - 13:29
pm say sorry  on  students

శానికీ ఆయన ప్రధాని. కానీ ఎవరో చేసిన చిన్న తప్పుకు తాను క్షమాపణలు కోరారు. వివరాల్లోకి  వెళితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు  పశ్చిమబెంగాల్ లోని విశ్వభారతి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో  పాల్గొన్నారు. అయితే అయన వస్తున్న సమయంలో కొంతమంది విద్యార్థులు  తమకు మంచినీటి సౌకర్యం లేదని విన్నవించారు. దానికి ప్రధాని మోదీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ..  అన్నిటికన్నా ముందు, విశ్వభారతి విశ్వవిద్యాలయం ఛాన్సలర్ హోదాలో నేను క్షమాపణలు చెప్తున్నాను. నేను వస్తున్నపుడు కొందరు విద్యార్థులు తమకు తాగునీటి ఏర్పాట్లు చేయలేదని సైగలద్వారా చెప్పారు. మీకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్తున్నాను' అని మోడీ అన్నారు దాంతో ప్రాంగణం మీదున్న అధికారులు అవాక్కయ్యారు. తాము చేసిన చిన్న పొరపాటుకు సాక్షాత్తు ప్రధాని క్షమాపణలు కోరడం ఏంటని సర్వత్రా చర్చించుకున్నారు. 

English Title
pm say sorry on students

MORE FROM AUTHOR

RELATED ARTICLES