వైసీపీ నేత‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న టెలీకాలింగ్

Submitted by arun on Wed, 01/24/2018 - 11:24
pkjagan

వచ్చీ రాగానే.. సర్వేలు స్టార్ట్ చేశాడు. చేసీ చేయగానే రిపోర్ట్ ఇచ్చేశాడు ఇప్పుడేమో కొత్తగా టెలీ సర్వేలు మొదలెట్టాడు. ఎస్ వైసీపీలో పీకే టీం చర్యలు ఊహాతీతంగా ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ పేరు ఇప్పుడు పార్టీ నేతల్లో ప్రశాంతత లేకుండా చేస్తోది. ఇంతకీ ప్రశాంత్ టీం చేస్తున్నదేంటి.?

ప్రతిపక్ష వైసీపీ నేతల్లో ఇప్పుడు ప్రశాంతత కరువైంది. దాని వెనకున్న రీజన్ ప్రశాంత్ కిషోర్. పీకే టీం చేస్తున్న సైలెంట్ సర్వేలతో వైసీపీ ఎమ్మెల్యేలు, లీడర్లలో ఎలక్షన్ టెన్షన్ మొదలైంది. ఇప్పటికే చేసిన సర్వేలతో సతమతమవుతోంటే కొత్తగా టెలీకాలింగ్ సర్వేతో పార్టీ నేతల్లో కొత్త ఆందోళన మొదలైంది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తమ బెర్త్‌లకు ఎక్కడ పీకే టీం రిపోర్ట్ ఎర్త్ పెడుతుందోనని వైసీపీ లీడర్లు టెన్షన్ పడుతున్నారు. గత సర్వేల్లో చాలా మంది నేతలకు పీకే సర్వేలో తక్కువ మార్కులు పడ్డాయి. ఇప్పుడు కొత్తగా చేస్తున్న టెలీకాలింగ్ సర్వే కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

అన్ని నియోజకర్గాల ఓటర్లకు ఫోన్ చేసి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారు? అని అడుగుతున్నారు. వాళ్లు గనక వైసీపీ అని చెప్తే టికెట్ ఎవరికి ఇస్తే స్వాగతిస్తారు..? ఏ పర్సన్‌కైతే ఓటు వేస్తారు.? వైసీపీ ఇంచార్జ్‌లు ఎలా పనిచేస్తున్నారు.? లాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవే కాదు వైసీపీ నుంచి ఎవరు ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు.? మీకు ఎవరు అందుబాటులో ఉంటున్నారు..? లాంటి ప్రశ్నలు అడుగుతూ పబ్లిక్ పల్స్ పట్టే ప్రయత్నం చేస్తోంది పీకే టీం. 

ప్రజలు మాత్రమే కాదు కొందరు పార్టీ నేతలకు కూడా ఇలాగే ఫోన్ కాల్స్ చేసి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. వీళ్లలో వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్‌లు కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని పవర్‌లోకి తీసుకురావటమే టార్గెట్‌గా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పార్టీని జనాలకు జొప్పించాలని ట్రై చేస్తున్నారు. ఐతే పార్టీ అధికారంలోకి రావాలంటే తానొక్కడినే కష్టపడితే చాలదు నేతలంతా గట్టిగా ప్రయత్నించాలని అధినేత భావిస్తున్నారు. అందుకే రచ్చబండ, పల్లెనిద్ర లాంటి కార్యక్రమాలు చేపట్టారు. వీటిపై వైసీపీ లీడర్లు ఎలా వర్క్ చేస్తున్నారనే దానిపై పీకే టీం టెలీకాలింగ్ సర్వే మొదలెట్టింది. ఇలా సర్వేల మీద సర్వేలతో ప్రశాంత్ కిషోర్ టీం లీడర్లకు ప్రశాంతత లేకుండా చేస్తోందని వైసీపీలో ప్రచారం జరుగుతోంది.
 

English Title
PK team collecting feedback on performance of YSRCP MLAs, MP in the district

MORE FROM AUTHOR

RELATED ARTICLES