స్టార్ ఆఫ్ ది డే.. మార్క్‌ ‘శంకర్‌’ పవనోవిచ్‌!

Submitted by arun on Thu, 08/23/2018 - 09:18
msp

చిరంజీవి 63వ జన్మదిన వేడుకలను మెగా అభిమానులు, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచే హైదరాబాద్‌లో చిరంజీవి ఇంటి వద్ద అభిమానుల సందోహం కనిపించింది. తనను కలవడానికి ఇంటి ముందుకు వచ్చిన అభిమానులను ఆప్యాయంగా చిరంజీవి పలకరించారు. పవన్‌కల్యాణ్‌ కుటుంబ సమేతంగా చిరంజీవి ఇంటికెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పవన్‌తోపాటు ఆయన సతీమణి అన్నా లెజినోవా, పిల్లలు ఉన్నారు. పవన్‌ కుమారుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ ఈ ఫొటోల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గత ఏడాది అక్టోబర్ 10న పుట్టిన ఈ బుడతడు.. అప్పట్లో నాన్న చేతుల్లో పొదివిపట్టుకున్నప్పటి ఫొటోలో మెరిశాడు. మళ్ళీ దాదాపు ఏడాది కావస్తుండగా.. ఇప్పుడు మళ్ళీ ఎక్స్‌పోజ్ కావడం.. మెగా పవర్ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికర అంశం. చూడ్డానికి చాలా క్యూట్‌గా కనిపిస్తున్న మినీ పవర్ స్టార్‌కీ.. పెదనాన్న మెగాస్టార్‌కీ ఒక విశిష్టమైన అనుబంధం వుంది. పవన్ చిన్న కొడుకు ‘మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌’. ఇందులో శంకర్ అనే మాటను.. ఉద్దేశపూర్వకంగానే అన్న ‘శివశంకర ప్రసాద్’ పేరులోంచి తీసి తన కొడుక్కి పెట్టానని అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పారు. తాజాగా పవర్ స్టార్, మెగాస్టార్‌ల సరసన మెరిసిన ఈ మెగా పవర్ స్టార్‌ని మురిపెంగా చూసుకుంటున్నారు మెగాభిమానులు.

English Title
Pics Of The Day : Pawan With Family Meets Chiru

MORE FROM AUTHOR

RELATED ARTICLES