జనసేనాని మిషన్ 2019

Submitted by arun on Fri, 06/29/2018 - 12:25

ఇప్పటి వరకు పర్యటనలు, యాత్రలకే పరిమితమైన జనసేన  తాజా పరిణామాలతో జవసత్వాలు నింపుకుంటుందా ?  కలిసి నడుద్దామంటూ  కామెడ్స్‌  ఇచ్చిన ఆఫర్‌‌ను జనసేనాని అందుకునేందుకు సిద్ధమయ్యారా ? 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పవన్  ప్రణాళికలు సిద్దం చేశారా ? అంటే అవుననే సమాధానాలు జనసేన నుంచి వినిపిస్తున్నాయి.  

జనసేనాని పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. పర్యటన సందర్భంగా పార్టీలో  చేరికలు  ప్రారంభం కావడాన్ని శుభసూచకంగా భావిస్తున్నారు.  2019 ఎన్నికలే టార్గెట్‌గా పర్యటనలకు శ్రీకారం చుట్టిన  పవన్  తొలి నుంచి సామాన్యుల స్వరాన్ని వినిపిస్తూ వచ్చారు.  ఈ నేపధ్యంలోనే  పవన్‌తో జత కట్టేందుకు వామపక్షాలు ఉత్సాహం చూపుతున్నాయి. ఇప్పటి వరకు పొత్తులపై ఎలాంటి ప్రకటన చేయకపోయినా  పలు కార్యక్రమాల్లో ఉమ్మడిగా పాల్గొనడంతో పొత్తులు ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది.  

పవన్ సైతం వామపక్షాలతో కలిసి నడించేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే కుల సమీకరణాలను పరిగణలోకి తీసుకున్న పవన్‌ అధికారంలోకి రావాలంటే  ప్రజాసంఘాలు, వామపక్షాల మద్దతు అవసరమని భావిస్తున్నారు. నిబద్ధత కలిగిన కార్యకర్తలు, కేడర్ ఉండటంతో కలిసి వస్తుందని పవన్ నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర పర్యటనలో  బీసీల సమస్యలను ప్రస్తావించడం ద్వారా ఆ వర్గం ప్రజలను ఆకట్టుకున్నారు.   

ఉత్తరాంధ్రా వరకు చూస్తే ఇప్పటివరకు జనసేనలో పవన్ మాత్రమే నాయకుడుగా ఉన్నారు. పార్టీలోకి ఇప్పుడిప్పుడే చేరికలు ప్రారంభమయ్యాయి. విశాఖకు చెందిన బాలజీ స్కూల్స్ అధినేత మండవ రవితో పాటు , క్రికెటర్ వేణుగోపాల్ తదితరులు పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఇప్పటి వరకు మాస్ కరిష్మా ఉన్న నేతలెవరూ పార్టీలోకి రాకపోవడం పెద్ద లోటుగా మారింది. కార్యకర్తలను ఏకం చేసే క్యాడర్‌ ఇందుకు అనుగుణంగా  నేతలు లేకపోవడంపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

 

English Title
Pawan Target Is On 2019 Elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES