రేపు కొండగట్టుకు జనసేనాని పవన్‌ కల్యాణ్‌

Submitted by arun on Sun, 01/21/2018 - 12:29
janasena

పవన్‌ కల్యాణ్‌ రేపు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లనున్నారు. ఆంజనేయస్వామిని దర్శించుకున్న తర్వాత....యాత్రకు సంబంధించిన కార్యాచరణ, రూట్‌మ్యాప్‌ను వివరించనున్నారు పవన్‌ కల్యాణ్‌. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభిస్తానని పవన్ ట్విట్టర్ లో వెల్లడించారు. తెలుగు రాష్ర్టాల్లోని తన రాజకీయ యాత్ర ప్రారంభానికి ముందు మొదటగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోనున్నట్లు పవన్ తెలిపారు. మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి' అంటూ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. తన అప్రహిత రాజకీయ యాత్రను తెలుగునేలపై పుణ్యస్థలమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభించబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.  


 

English Title
pawan kalyan visit kondagattu tomarrow

MORE FROM AUTHOR

RELATED ARTICLES