వరదలతో ఈశాన్య రాష్ట్రాలు విలవిల

Submitted by arun on Mon, 06/18/2018 - 10:37
floods

వరదలతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి.  అసోం, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో ప్రజాజీవితం అస్థవ్యస్తం అయింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సహాయ కార్యక్రమాలను మరింత పెంచింది.

అసోంలో వరదల ధాటికి 17 మంది మృతి చెందారు. 716 గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 8 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. నిరాశ్రయులను ఆదుకునేందుకు అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సహాయ కార్యక్రమాలను వేగవంతం చేసింది. నిరాశ్రయులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బాదితులకు మంచినీరు, ఆహార పదార్ధాలను అందిస్తున్నారు. కరీంగంజ్ ప్రాంతం, హైలకండి ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. 

త్రిపురలో కుండపోత వర్షాలు ప్రజాజీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరధ ధాటికి ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. రాకపోకలు నిలిచిపోయాయి. వ్యాపార కార్యక్రమాలను స్తంభించిపోయాయి. అదే విధంగా మణిపూర్ రాష్ట్రంలో కూడా వరదలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వరదలు సంభవిస్తున్నాయి. వరదల్లో చిక్కుకుని స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వరదల ధాటికి ఇద్దరు మృతి చెందారు.

ముంబైలో కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. మహాత్మాగాంధీ మార్కెట్ పూర్తిగా నీటమునిగింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దుకాణదారులు వ్యాపారాలు లేక అవస్థలు పడుతున్నారు. చల్లని గాలులు వణుకుపుట్టించడంతో జనం టీ దుకాణాలకు పరుగులు పెడుతున్నారు.

English Title
Northeast States floods

MORE FROM AUTHOR

RELATED ARTICLES