రవిశాస్త్రితో డేటింగ్‌.. స్పందించిన నటి

Submitted by arun on Tue, 09/04/2018 - 11:21
Ravi ShastriNimrat Kaur

తాను టీమిండియా కోచ్ రవిశాస్త్రితో సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ కొట్టిపారేసింది. ఈ వార్తలన్నీ అవాస్తవమని చెప్పింది. ఆడి కార్ల సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో తాము పాల్గొన్నామని, అంతకు మించి మరేమీ లేదని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌తో రహస్యంగా డేటింగ్‌ చేస్తున్నాడనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. గత రెండేళ్లుగా వీరి ప్రేమాయణం సాగుతుందని, ప్రముఖ కార్ల కంపెనీ ‘ఆడీ’ ప్రచార కార్యక్రమంలో భాగంగా కలిసినప్పుడు మొదలైన ప్రేమే మరింత గాఢంగా మారిందని సోషల్‌మీడియా కోడై కూస్తోంది. అయితే ఇవన్నీ గాలివార్తలని నిమ్రత్‌ కౌర్‌ ఒక్క ట్వీట్‌తో కొట్టి పారేసారు. 

English Title
Nimrat Kaur responds to dating Indian cricket coach rumors

MORE FROM AUTHOR

RELATED ARTICLES