'న్యూట‌న్'.. జ‌స్ట్‌ సూప‌ర్‌

న్యూట‌న్.. జ‌స్ట్‌ సూప‌ర్‌
x
Highlights

90వ అకాడ‌మీ అవార్డ్స్ (ఆస్కార్‌)కి ఎంపికైన భార‌తీయ చిత్రం 'న్యూట‌న్‌'. ఉత్త‌మ విదేశీ చిత్రం అనే విభాగంలో ఈ సంవ‌త్స‌రానికి గానూ ఆస్కార్‌కి ఎంపికైన...

90వ అకాడ‌మీ అవార్డ్స్ (ఆస్కార్‌)కి ఎంపికైన భార‌తీయ చిత్రం 'న్యూట‌న్‌'. ఉత్త‌మ విదేశీ చిత్రం అనే విభాగంలో ఈ సంవ‌త్స‌రానికి గానూ ఆస్కార్‌కి ఎంపికైన 'న్యూట‌న్‌'.. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. రాజ్‌కుమార్ రావ్‌, అంజ‌లి పాటిల్ ('నా బంగారు త‌ల్లి' ఫేమ్‌) , పంక‌జ్ త్రిపాఠి, ర‌ఘ‌బీర్ యాద‌వ్‌, సంజయ్ మిశ్రా ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రానికి అమిత్ వి.మ‌సుర్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బెర్లిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శిత‌మై ప్ర‌శంస‌లు పొందిన ఈ 106 నిమిషాల సినిమా.. 350 భార‌తీయ స్క్రీన్స్‌లో శుక్ర‌వారం విడుద‌లైంది.

తొలి రోజు ఈ సినిమాకి కేవ‌లం రూ.96 ల‌క్ష‌ల వ‌సూళ్లు రాగా.. రెండో రోజు అంటే శ‌నివారం 162.5% క‌లెక్ష‌న్లు పెరిగాయి. అంటే.. రూ.2.52 కోట్ల వ‌సూళ్లు ద‌క్కాయి. ఆస్కార్‌కి నామినేట్ అవ‌డం వ‌ల్ల.. జ‌నాలకి ఆస‌క్తి పెరిగి ఉండ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌న్న‌ది కొంద‌రి విశ్లేష‌కుల మాట‌. ఆదివారం వ‌సూళ్లు కూడా బాగుంటాయ‌నే మాట వినిపిస్తోంది. మొత్తానికి 'న్యూట‌న్' క‌మ‌ర్షియ‌ల్‌గా కూడా స‌క్సెస్ అయ్యేలా ఉన్నాడు. న్యూట‌న్‌.. జ‌స్ట్ సూప‌ర్‌..అనక త‌ప్ప‌దు ఇప్పుడు.

Show Full Article
Print Article
Next Story
More Stories