ఎన్నికల వేళ తెరపైకి మరో కొత్త పార్టీ...ఓట్లతో సత్తా చూపుతామని శపధం

x
Highlights

విజయవాడలో సమావేశమైన భార్యా బాధితుల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. అది తమ సంఘాన్ని ప్రత్యేక రాజకీయ పార్టీగా మార్చాలని డిసైడ్ అయింది. అన్ని చట్టాలు...

విజయవాడలో సమావేశమైన భార్యా బాధితుల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. అది తమ సంఘాన్ని ప్రత్యేక రాజకీయ పార్టీగా మార్చాలని డిసైడ్ అయింది. అన్ని చట్టాలు భార్యలకు అనుకూలంగానే ఉన్నాయని, భార్యల కారణంగా ఎంతోమంది జీవితాలు నాశనమయ్యాయని భార్యా బాధితుల సంఘం ఆరోపించింది. తెలుగు రాష్ట్రాలలో ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించి తద్వారా భార్యా బాధితుల సంఘం వెల్లడించింది.

ఎలక్షన్లు దగ్గర పడుతున్న టైంలో ఏపీలో ఒక పార్టీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పెద్దపార్టీలు మెజార్టీ ఓట్లను కైవసం చేసుకునేందుకు రేసుగుర్రంలా పరుగెడుతుంటే ఓ పార్టీ మాత్రం విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటుంది. గృహహింస నిరోధక చట్టం ద్వారా అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న మగవాళ్లు ఓ భార్య బాధితుల పార్టీని స్ధాపిస్తున్నారు. భార్యల వల్ల అన్యాయంగా బాధపడుతున్న భర్తలకు ఎక్కడా న్యాయం జరగకపోవడంతో తమ హక్కులను కాపాడుకునేందుకు ఏకంగా పార్టీ పెట్టి ఎన్నికల్లో నిలబడేందుకు సిద్ధమయ్యారు.

భార్యలు, ఆడపడుచులు, అత్త మామ వేదింపుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు భార్య బాధితులు కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు భార్యబాధితులు చెబుతున్నారు. ఓ పార్టీని పెట్టుకొని తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. మానసిక హింసకు గురవుతోన్న ఎంతోమంది మగవారికి రక్షణ కల్పించడంతో పాటు వారికి అండగా నిలవడానికే ఈ పార్టీని స్థాపిస్తున్నట్లు చెబుతున్నారు.

వచ్చే నెలలో హైదరాబాద్‌ లేదా విజయవాడలో భార్యాబాధితులతో 1కే రన్‌ నిర్వహించాలని భార్యా బాధితుల సంఘం భావిస్తోంది. 498 కేసు ఉన్నా ఒక ఏడాది తర్వాత తమకు రెండో వివాహానికి అనుమతి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మెయింటెన్స్‌, డొమెస్టిక్‌ వయలెన్స్‌ను ఆ చట్టం నుంచి తొలగించాలని వారు డిమాండ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories