నీట్ - 2018 ఫ‌లితాల్ని ఇలా చెక్ చేసుకోండి

Submitted by lakshman on Wed, 01/24/2018 - 12:20
neet

మెడిసిన్‌ అడ్మిష‌న్స్ కోసం దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించిన నీట్ - 2018 ప‌రీక్ష  ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఈ పరీక్షా ఫ‌లితాల‌ను నేష‌న‌ల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేష‌న్ విడుద‌ల చేసింది. ఫ‌లితాల‌కోసం సంబంధిత వెబ్ సైట్  nbe.edu.in. సంద‌ర్శించాల‌ని అధికారులు సూచించారు. ఇందులో ఎవ‌రికి ఎంత  మెరిట్ , ఎవ‌రికి ఏ  గ్రేడ్ వ‌చ్చిందో తెలుసుకోవ‌చ్చు. 
అయితే నీట్ ప‌రీక్ష ఫ‌లితాల కోసం వెబ్ సైట్లో ఇలా చెక్ చేసుకోవాలి. 
1. ముందుగా విద్యార్ధులు నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేష‌న్ అఫీయ‌ల్ వెబ్ సైట్ nbe.edu.in సంద‌ర్శించాలి. 
2 వెబ్ సైట్లోకి ప్ర‌వేశించిన అనంత‌రం నీట్ పీజీ లింక్ ను క్లిక్ చేయాలి. 
3. లింక్ క్లిక్ చేసిన త‌రువాత నీట్ ప‌రీక్షా ఫ‌లితా కోసం త‌మకు కేటాయించిన వివరాల్ని అందులో పొందు ప‌ర‌చాలి. 
4. అలా పొందుప‌రిచిన అనంత‌రం ఆ లింక్ ను క్లిక్ చేస్తే రిజ‌ల్ట్ తో పాటు విద్యార్ధులు వివ‌రాలు డిస్ ప్లే అవుతుంది.  

English Title
NEET PG 2018 exam results out, here is how to check results

MORE FROM AUTHOR

RELATED ARTICLES