నారా కుటుంబ సభ్యుల మొత్తం ఆస్తి రూ.88.68 కోట్లు

x
Highlights

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తుల వివరాలను మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. వరుసగా ఎనిమిదో సారి ఆస్తుల వివరాలను ప్రకటించారు. కుటుంబం మొత్తం...

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తుల వివరాలను మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. వరుసగా ఎనిమిదో సారి ఆస్తుల వివరాలను ప్రకటించారు. కుటుంబం మొత్తం ఆస్తుల విలువ 88.68 కోట్లు అని లోకేష్ చెప్పారు. చంద్రబాబు నికర ఆస్తి విలువ కన్నా ఆయన మనుమడు దేవాన్ష్ పేరున 15 కోట్ల ఆస్తులు అదనంగా ఉన్నాయి.

నారా కుటుంబం ఆస్తుల వివరాలను మంత్రి లోకేష్ బుధవారం అమరావతిలో ప్రకటించారు. లోకేష్ తమ ఆస్తుల వివరాలు ప్రకటించడం వరసగా ఇది ఎనిమిదో సారి. చంద్రబాబు మొత్తం ఆస్తుల విలువ 29.9 కోట్లు కాగా 5.31 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు. తన తల్లి భువనేశ్వరికి 31.01 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఇక తన పేరున 21.40 కోట్ల ఆస్తులు, తన భార్య బ్రాహ్మణి పేరున 7.72 కోట్లు విలువ చేసే నికర ఆస్తి., కుమారుడు దేవాన్ష్ పేరున 18.72 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్లు లోకేష్ వివరించారు.

గత సంవత్సరంతో పోలిస్తే తన తండ్రి చంద్రబాబు నికర ఆస్తి విలువ 46 లక్షల రూపాయలు, తల్లి భువనేశ్వరి ఆస్తుల ఏడు కోట్లు పెరిగాయని చెప్పారు లోకేష్. అలాగే, తన ఆస్తి విలువ రూ.90 లక్షలు పెరిగినట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం హెరిటేజ్ నికర లాభం 60.38 కోట్లు ఉందని లోకేష్ చెప్పారు. హైదరాబాద్‌లో ఇంటి విలువ 8 కోట్లు, నారావారిపల్లెలోని ఇంటి విలువ 23.83 లక్షలు చేస్తుందని చెప్పారు. నిర్వాణ హోల్డింగ్స్‌ నికర ఆస్తులు రూ. 6.83 కోట్లు ఉన్నాయన్నారు. భువనేశ్వరి పేరున 22.35 కోట్ల అప్పులు ఉన్నాయని లెక్కలు చూపించారు లోకేష్. రాజకీయాల్లో ప్రజలకు జవాబుదారీ తనంతో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆస్తులను ప్రకటించినట్టు చెప్పారు. తిత్లీ తుఫాను సహాయం కింద రూ.60 లక్షలు సాయంగా అందించామని లోకేష్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories