దారుణం...పెట్రోల్ బంక్‌కు కార్మికుడిని కట్టేసి కొరడాతో కొట్టిన యజమాని

Submitted by arun on Fri, 07/06/2018 - 12:36

మధ్యప్రదేశ్‌లోని హోషంగ్‌బాద్‌లో దారుణం జరిగింది. పెట్రోల్ బంక్‌లో ఓ కార్మికుడిని చితక్కొట్టాడు బంక్ యాజమాని. గత ఆరు రోజుల నుంచి అనారోగ్యంతో కార్మికుడు డ్యూటీకి రావడంలేదని ఆగ్రహించిన యాజమాని..కార్మికుడిని పిలిపించాడు. పెట్రోల్ బంక్ కు కార్మికుడిని తాళ్లతో కట్టేసి కొరడాతో చితకబాదాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 34 సార్లు కొరడా ఝులిపించాడు. అక్కడే ఉన్న మరోవ్యక్తితో కూడా అతను కొట్టించాడు. ఎంత బతిమిలాడుకున్న అతన్ని విడిచిపెట్టలేదు. అక్కడికొచ్చిన ఓ వాహనదారుడు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయగా, వైరల్‌ కావటంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేశారు. ‘నాకు చిన్న యాక్సిడెంట్‌ అయ్యింది. అందుకే వారం నుంచి పనిలోకి రావట్లేదు. ఆ కోపంతోనే బంక్‌ ఓనర్‌, అతని స్నేహితుడు నాపై దాడి చేశారు’ అని బాధితుడు చెబుతున్నాడు.

English Title
MP, Petrol Pump Owner Whips Employee For Being Absent

MORE FROM AUTHOR

RELATED ARTICLES