మినరల్‌ కంటే జనరల్‌ వాటరే బెటర్‌

మినరల్‌ కంటే జనరల్‌ వాటరే బెటర్‌
x
Highlights

వేసవి వచ్చిందంటే చాలు తాగునీటి కష్టాలు. సరిగ్గా ఎక్కడా నీరు దొరకని పరిస్థితి. దీంతో ప్రతిఒక్కరూ అందుబాటులో దొరికే మినరల్ వాటర్ తెచ్చుకుని...

వేసవి వచ్చిందంటే చాలు తాగునీటి కష్టాలు. సరిగ్గా ఎక్కడా నీరు దొరకని పరిస్థితి. దీంతో ప్రతిఒక్కరూ అందుబాటులో దొరికే మినరల్ వాటర్ తెచ్చుకుని తాగేస్తుంటారు. అది సురక్షిత నీరని, వ్యాధులు కూడా ధరి చేరవని భావిస్తుంటారు. అయితే, నిజం కాదు. మినరల్ వాటర్ కంటే జనరల్ వాటరే బెటరంట. మినరల్ వాటర్ తాగే వారు రోగాలపాలువుతున్నట్టు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని వైద్యులు కూడా చెబుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మినరల్ వాటర్, ప్యూరిఫైడ్ వాటర్.. పేరు ఏదైనా ఆ నీరు తాగితే రోగాల బారినపడటం ఖాయం. హైదరాబాద్‌లో మినరల్ వాటర్ ప్లాంట్లు.. బ్రాండెడ్ కంపెనీల పేర్లతో లైసెన్స్ లేకున్నా నీటిని శుద్ధి చేస్తూ అమ్మకాలు సాగిస్తున్నాయి. అయితే, ఆ నీళ్లు సరిగ్గా ప్యూరిఫై చేయకుండా రుచిగా ఉండేందుకు ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారు. రివర్స్ ఆస్మోసిస్ సిస్టమ్ లాంటి కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా నీటిని శుద్ది చేస్తున్నారు.

ఇది తెలియని జనం డబ్బాలకు డబ్బాలు కొనుక్కెళ్లి తాగుతూ రోగాల బారినపడుతున్నారు. మినరల్ వాటర్ తయారీదారులు ఒకసారి ఆ నీటిని చెక్ చేసి బాటిల్స్‌ లాక్ చేశాక.. నెలలు గడిచినా ఆ నీరు అలాగే ఉంటుంది. ఆ వాటర్ క్యాన్లలో క్లోరిన్ శాతం తక్కువగా ఉంటుందని, ఆ నీరు తాగితే వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలు సర్వేల ద్వారా వెల్లడికావడం, వైద్యులు హెచ్చరిస్తుండటంతో మినరల్ వాడకాన్ని చాల మంది తగ్గించేస్తున్నారు. 20 లీటర్ల క్యాన్ 25 నుంచి 30 రూపాయలు దాకా వెచ్చించి కొని.. తాగితే రోగాల పాలయ్యే కంటే అందుబాటులో ఉన్న నీటినే కాచి చల్లార్చి తాగడం బెటర్ అని నమ్ముతున్నారు మహిళలు. సో.. అర్దమైంది కదా.. మినరల్ వాటర్ కంటే జనరల్ వాటరే బెటర్. మరి కుళాయి నీరే తాగేద్దామా..

Show Full Article
Print Article
Next Story
More Stories