సెక్స్ రాకెట్.. మెహరీన్‌ను విచారించిన అమెరికా అధికారులు

Submitted by arun on Mon, 06/18/2018 - 11:10
Mehreen

కెనెడా నుంచి అమెరికాకు వెళ్లిన నటి మెహరీన్‌ను అక్కడి ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రశ్నించింది. ఆమె ఏ పని మీద అమెరికాకు వెళ్లారన్న విషయాన్ని వివరంగా అడిగింది. అమెరికాలో భారీ సెక్స్‌ రాకెట్‌ నడిపించిన కిషన్‌ మోదుగుమూడి దంపతులను ఇటీవల అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని గురించి కూడా మెహరీన్‌ను అడిగారట. తన కుటుంబాన్ని కలిసేందుకు యూఎస్ వెళ్ళిన తనను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలో నిలిపివేసి సుమారు 30 నిముషాలపాటు విచారించారని ఆమె వెల్లడించింది. నేను టాలీవుడ్ నటినని తెలుసుకున్న వారు..ఈ సెక్స్ రాకెట్ విషయమై చాలా ప్రశ్నలు అడిగారు.అసలు దీని గురించి తెలియని  నేను షాకయ్యా..నా పేరెంట్స్ ను కలిసేందుకు తరచూ అమెరికా వెళ్లి వస్తుంటా.. కానీ ఓ టాలీవుడ్ నిర్మాత ఈ దందా నడుపుతున్న విషయం వారు చెప్పేవరకూ నాకు తెలియదు.
 
అమెరికాకు వచ్చే ప్రతి టాలీవుడ్ నటినీ ప్రశిస్తున్నామని అధికారులు చెప్పారు..అని మెహరీన్ పేర్కొంది. ఈమెతో పాటు మరో ముగ్గురు తెలుగు హీరోయిన్లనూ వారు సుమారు 6 గంటలపాటు విచారించినట్టు తెలుస్తోంది. కాగా…నాని మూవీ..కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెహరీన్.. కేరాఫ్ సూర్య, జవాన్ చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం హీరో గోపీచంద్ సినిమా ‘ పంతం ‘ లో నటిస్తోంది.
 

English Title
Mehreen Pirzada questioned about sex racket after revealing Tollywood connection

MORE FROM AUTHOR

RELATED ARTICLES