పెళ్లి చేసుకుంటే గుండె పదిలం

Submitted by arun on Wed, 06/20/2018 - 10:58
Marriage

పెళ్లంటే ఇప్పటికీ ఎంతో మంది భయపడుతుంటారు. పెళ్లంటే నూరేళ్ల పంట కాదు.. మంట అంటూ పెళ్లి చేసుకోబోయే ఫ్రెండ్స్‌ను ఆట పట్టిస్తుంటారు. తొందరపడొద్దు బ్రదర్ అంటూ సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటారు. కానీ ఈ తాజా అధ్యయనం చూస్తే మాత్రం వెంటనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఎందుకంటే పెళ్లి గుండెకు మంచిది అని తేల్చారు కాబట్టి. లేటు వయసులో ఓ తోడు ఉంటే గుండె జబ్బులు, గుండె పోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని రీసెర్చర్లు తేల్చారు.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మందిని అధ్యయనం చేసి.. బల్ల గుద్ది మరీ చెబుతున్నారు శాస్త్రవేత్తలు. యూరప్, ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆసియాల్లోని అన్ని వర్గాలకు చెందిన 42 నుంచి 70 ఏళ్ల వయసున్న వారిపై ఈ అధ్యయనం చేశారు. పెళ్లి చేసుకున్న వారితో పోలిస్తే పెళ్లి చేసుకోని వారు, విడాకులైనవారు, భర్త లేదా భార్య చనిపోయిన వారిలో గుండె జబ్బుల ముప్పు 42 శాతం, గుండె రక్తనాళాలు బ్లాక్ అయ్యే ముప్పు 16 శాతం అధికంగా ఉన్నట్టు తేల్చారు.

పెళ్లి కాని వారు గుండెపోటుతో చనిపోయే ముప్పు 55 శాతం, రక్తనాళాలు బ్లాక్ అయ్యి గుండె జబ్బు వచ్చి చనిపోయే ముప్పు 42 శాతం అధికంగా ఉంటున్నట్టు గుర్తించారు. ఇక, అత్యధికంగా ఈ ముప్పు మగవారిలోనేనని తేల్చి శాస్త్రవేత్తలు షాకిచ్చారు. పెళ్లి అయినా కాకపోయినా ‘సహజీవనం’ చేసినా గుండె జబ్బు ముప్పులు చాలా వరకు తగ్గుతాయని శాస్త్రవేత్తలు సూచిస్తు్న్నారు. ఇంతకీ ఈ అధ్యయనం చేసింది ఎవరో చెప్పలేదు కదూ.. బ్రిటన్‌లోని స్టోక్ ఆన్ ట్రెంట్‌లోగల రాయల్ స్టోక్ ఆస్పత్రి గుండె జబ్బుల విభాగం చేసింది ఈ అధ్యయనం. 

English Title
Marriage Is Good Medicine for the Heart

MORE FROM AUTHOR

RELATED ARTICLES