ప్రజాప్రతినిధులే టార్గెట్‌గా మావోల హత్యలు

Submitted by arun on Mon, 09/24/2018 - 11:15
maoist

విశాఖ ఏజెన్సీలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలతో తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు హై అలెర్ట్ విధించారు. ఉమ్మడి రాష్ట్రంలో పలుసార్లు దాడులకు తెగబడి ప్రజాప్రతినిధులను హతమార్చిన మావోయిస్టులు.. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఓ అధికార పార్టీ ఎమ్మెల్యేతో సహా మరో మాజీ ఎమ్మెల్యేలను దారుణంగా కాల్చి చంపడం కలకలం రేపుతోంది. ఇప్పటిదాకా మావోయిస్టుల దాడుల్లో ఎంత మంది హతమయ్యారు..? ఎప్పుడెప్పుడు ఎవరు మృత్యువాతపడ్డారు..? 

తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసుకొని హత్యలకు తెగబడ్డారు. స్థానిక సమస్యలు, ప్రభుత్వానికి హెచ్చరికగా కొన్నిసార్లు, తమ హిట్ లిస్ట్ మేరకు మరికొన్ని చోట్ల మావోయిస్టులు ఘాతుకాలకు పాల్పడ్డారు. 1994లో అప్పటి స్పీకర్ శ్రీపాదరావును హత్య చేశారు నక్సల్స్. మంథనిలో శ్రీపాదరావును కిడ్నాప్ చేసి హతమార్చారు.

ఇక 2000 సంవత్సరంలో కూడా మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం మావోయిస్టులను ఎక్కడిక్కడ అణిచివేసేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ సక్సెస్ కావటంతో మావో బలగాలు తీవ్రంగా నష్టపోయాయి. దీనికి బాధ్యతగా అప్పటి సీఎం చంద్రబాబు, హోంమంత్రి మాధవరెడ్డిని హిట్ లిస్ట్‌లో చేర్చిన మావోయిస్టులు మాధవరెడ్డిని రెవెన్యూ శాఖ అప్పగించిన తర్వాత దాడికి తెగబడ్డారు. ఘట‌్‌కేసర్ ఫ్లై ఓవర్ దగ్గర జరిగిన బాంబు దాడిలో మాధవరెడ్డి మృతిచెందారు.

2003 అక్టోబరు 1న అలిపిరిలో చంద్రబాబుపై దాడికి తెగబడ్డారు. తిరుమల నుంచి అలిపిరి టోల్ గేట్ దాటగానే మావోయిస్టులు ల్యాండ్ మైన్ పేల్చారు. ఈ ఘటనలో చంద్రబాబు గాయాలతో బయటపడ్డారు.

2001 డిసెంబర్‌లో దేవరకొండ ఎమ్మెల్యే రాగ్యానాయక్‌ను మావోలు హత్య చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం మడ్డిమడుగులో రాగ్యానాయన్‌ను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. 2005 ఆగస్టులో డీకే అరుణ తండ్రి చిట్టెం నర్సిరెడ్డిని హత్య చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేటలో స్కూల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన నర్సిరెడ్డిపై కాల్పులు జరిపారు మావోయిస్టులు. ఈ దాడిలో మరో తొమ్మిది మంది కూడా చనిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు తొలిసారిగా సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలపై మావోయిస్టులు  పంజా విసరడం సంచలనంగా మారింది. 

English Title
maoist killed political leaders

MORE FROM AUTHOR

RELATED ARTICLES