చెట్టుకు క‌ట్టేసి సెల్ఫీలు దిగి

Submitted by arun on Fri, 02/23/2018 - 12:56
keralaassaultselfies

దుకాణాలలో వస్తువులను దొంగిలిస్తున్నాడనే ఆరోపణతో కొంతమంది ఓ వ్యక్తిని కట్టేసి కొట్టిన సంఘటన కేరళలో చోటుచేసుకుంది. అయితే సదరు వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేదు. ఇదిలాఉండగా ఆ వ్యక్తిని కట్టేసి కొడుతుండగా కొంతమంది యువకులు సెల్ఫీలు దిగుతూ మరోవైపు పైశాచిక ఆనందాన్ని పొందారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ 27 ఏళ్ల యువకుడు మతిస్థిమితం లేని వాడు. కేరళలోని పాలక్కడ్‌ జిల్లాలో గల అత్తపాడి అనే గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో తిరుగుతూ బతికేస్తున్నాడు. అయితే, అతడు ఆ గ్రామంలోని దుకాణాల్లో తినుబండారాలు దొంగిలించి జీవనం సాగిస్తున్నాడని నలుగురు చెబుతుండటంతో అతడిని ప్రత్యేకంగా పట్టుకున్నారు. కట్టేసి కొన్ని గంటలపాటు టార్చర్‌ పెట్టారు. మధ్యాహ్నం వేళ జాలి చూపిన ఓ వ్యక్తి పోలీసులకు కబురు చేయడంతో వారు వచ్చి అతడిని విడిపించారు. అప్పటికే అతడు వాంతులు చేసుకొని కుప్పకూలిపోయాడు. ఐదుగంటల ప్రాంతంలో ఆస్పత్రికి తరలించగా అతడు చనిపోయాడు. ఇదిలాఉండగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది సహజమరణమా, స్థానికులు కొట్టిన దెబ్బలు మూలంగా చనిపోయాడా అనే దిశగా విచారణ చేస్తున్నారు. పోస్ట్‌మార్టమ్‌ అనంతరం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఓ పోలీస్‌ అధికారి వివరించారు.
 

English Title
man tied and assaulted

MORE FROM AUTHOR

RELATED ARTICLES