భార్య, మూడేళ్ల కుమారుడిని చంపిన భర్త.. ఆపై చేసిన పని చూస్తే..

Submitted by nanireddy on Wed, 06/06/2018 - 09:40
man killed his wife and son

వేరే మహిళతో వివాహేతరసంబంధం పెట్టుకుని కట్టుకున్న  భార్య, మూడేళ్ళ కుమారుడుని హత్య చేశాడో వ్యక్తి. ఈ ఘటన కర్నూల్ జిల్లా బళ్లారి చౌరస్తా సమీప సంపత్‌నగర్‌లో చోటుచేసుకుంది.  పాణ్యం మండలం బలపనూరు గ్రామానికి చెందిన ఉస్సేనయ్య, లక్ష్మీదేవి దంపతుల కుమార్తె ఉదయభానుకు నాలుగేళ్ల క్రితం ప్రకాశం జిల్లా బైనపల్లికి చెందిన ఆనంద్‌తో వివాహం జరిగింది. చెడువ్యసనాలకు బానిసైన ఆనంద్‌ మరో మహిళతో  వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో తాగివచ్చి  భార్యా కొడుకుని కొట్టేవాడు. పైగా అదనపు కట్నం కావాలని వేధించేవాడు. ఈ విషయం ఉదయభాను తన తల్లిదండ్రులకు చెప్పింది. కుమార్తె బాధ చూడలేక అప్పుడప్పుడు కొంత డబ్బును అల్లుడికి ఇచ్చేవాడు మామ ఉస్సేనయ్య. అయితే తన భర్తకు మరో మహిళతో అక్రమసంబంధం ఉన్నట్టు తెలుసుకున్న  ఉదయభాను.. ఆనంద్ ను ప్రశ్నించింది. దీంతో అగ్రహావేశానికి లోనైనా ఆనంద్ గర్భిణీ అని కూడా చూడకుండా భార్యను హత్య చేశాడు. హత్య విషయం ఎవరికైనా చెబుతాడేమోనని మూడేళ్ళ కుమారుడిని కూడా హత్య చేసి ఏమి తెలియనట్టు బంధువులకు చరవాణి ద్వారా విషయం చేరవేశాడు.  దీనిపై అనుమానం చెందిన అత్తమామలు అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.     

English Title
man killed his wife and son

MORE FROM AUTHOR

RELATED ARTICLES