అత్తింటి ఆగడాలకు మగాడి బలి

Submitted by arun on Tue, 07/03/2018 - 14:53

భార్యతో కలిసి అత్తింటి వారు పెడుతున్న వేధింపులు తాలలేక ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అంతకుముందు ఓ సెల్ఫీ వీడియో తీసి అందులో ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను వివరించాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తీసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది. 

విజయవాడ కృష్ణలంకకు చెందిన గురువారెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు దారితీసిన కారణాలను వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియోను తీసి అనంతరం రైలుకింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. తన మృతికి భార్య, అత్తమామలు, బావమరిది వేధింపులే కారణమని చెప్పాడు. అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తున్నందుకు క్షమించాలని తల్లిదండ్రులను వేడుకున్నాడు. 

ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అతని ఫోన్‌లో లభించిన సెల్ఫీ వీడియో ద్వారా ఆత్మహత్యకు కారణాలు తెలుసుకునేందు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే చేయని తప్పునకు రెండు రోజుల పాటు జైల్లో ఉంచడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. గురువారెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

English Title
Man Commits Suicide In Vijayawada

MORE FROM AUTHOR

RELATED ARTICLES