రిలీజ్‌కు ముందే రికార్డు

Submitted by arun on Mon, 04/16/2018 - 15:32
Bharat ane nenu

సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ ‘ భరత్ అనే నేను ‘ విడుదలకు ముందే రికార్డు బ్రేక్ చేస్తోంది. వరల్డ్ వైడ్ గా 2000 థియేటర్లలో ఈ చిత్రం ప్రీమియర్ షో లను ప్రదర్శించ నున్నట్టు ఈ మూవీ యూనిట్ తెలిపింది. అమెరికాలో గతంలో మహేష్ చిత్రాలు విడుదలైన థియేటర్ల సంఖ్య కన్నా ఎక్కువ థియేటర్లలో ” భరత్ అనే నేను ” చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు పేర్కొంది.

యూఎస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మహేష్ సినిమా ప్రీమియర్ షోలకు టికెట్ల అమ్మకం ప్రారంభమైందని యూనిట్ వెల్లడించింది. మొత్తం 1000 సినిమా హాల్స్ లో చిత్రం విడుదలవుతుందని తెలిపింది. అంటే 'బాహుబలి-2'కు సమానంగా 'భరత్ అనే నేను' విడుదల కానుంది. సినిమాకు హిట్ టాక్ వస్తే, తొలి వీకెండ్ లో 3 మిలియన్ డాలర్ల వరకూ కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రీమియర్ షోలతోనే 1.5 మిలియన్ డాలర్ల వరకూ కలెక్షన్ రావచ్చని కూడా భావిస్తున్నారు. కాగా, ఇండియాలో సైతం 'బుక్ మై షో' వంటి వెబ్ సైట్లలో సినిమా టికెట్ల అమ్మకం ప్రారంభం కాగా, తొలిరోజు టికెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడవుతున్నాయి. 

English Title
maheshs bharat ane nenu record

MORE FROM AUTHOR

RELATED ARTICLES