పిల్లోడి పేరు ఖరారు కోసం ఎన్నికలు

Submitted by arun on Wed, 06/20/2018 - 14:21
couple

పిల్లలకు నామకరణం అనేది మనదేశంలో చాలా సింపుల్‌‌గా జరిగే కుటుంబ వేడుక. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ జంట తమ పిల్లాడికి పేరును వినూత్నంగా పెట్టారు. ఎన్నికల తరహాలో పోలింగ్ నిర్వహించి నామకరణోత్సవం నిర్వహించారు. బంధు, మిత్రులను ఆశ్చర్యపరిచారు. మహారాష్ట్రలోని  గోండియాకి చెందిన మిథున్, మన్షి బంగ్ దంపతులకు ఇటీవల కుమారుడు జన్మించాడు. జాతకం ప్రకారం అతడు భవిషత్యులో రాజకీయ నాయకుడు అవుతాడని తెలిసింది. దీంతో ఎన్నికల ద్వారా వినూత్నంగా బాబుకు  పేరు పెడితే బాగుంటుందని తల్లిదండ్రులు నిర్ణయించారు. 

తమ కుమారుడి బారసాల వేడుకను ఈ నెల 15న మిథున్, మన్షి బంగ్ దంపతులు నిర్వహించారు. బంధువులు, స్నేహితులను పిలిపించి బాబు పేరు కోసం పోలింగ్ నిర్వహించారు.  యక్ష, యోవిక్, యువాన్ అనే  మూడు పేర్లపై ఓటింగ్ జరిగింది. ‘‘యువాన్’’ అనే పేరుకు ఎక్కువ ఓట్లు రావడంతో తమ కుమారుడికి ఆ పేరే పెట్టారు. ఓటింగ్ ద్వారా తమ బాబు పేరు పెట్టడంపై మిథున్, మన్షి బంగ్ దంపతులు, బంధువులు మురిసిపోతున్నారు. ఇది నిజంగా వినూత్న కార్యక్రమం అని, పెద్దయ్యాక తర్వాత ఓటింగ్ తన పేరు పెట్టారని తెలుసుకుని యువాన్ సంతోషపడతాడు అని చెబుతున్నారు. మా కుటుంబానికి యువాన్ నామకరణోత్సవం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని మిథున్, మన్షి బంగ్ దంపతులు అంటున్నారు.  ఓటింగ్ తో పేరు పెట్టడంపై స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. 

English Title
Maharashtra couple hold election to choose baby’s name

MORE FROM AUTHOR

RELATED ARTICLES