అసెంబ్లీలో వివాదాస్ప‌దమైన ఎలుక‌ల పంచాయితీ

Submitted by lakshman on Sat, 03/24/2018 - 11:07
Maharashtra: BJP minister says 3 lakh tablets used in Mantralaya, not 3 lakh rats killed

అసెంబ్లీ లో ప్ర‌జాస‌మ‌స్య‌లు చ‌ర్చించాల్సినే నేత‌లు ఎన్ని ఎలుక‌ల్ని చంపారు..? ఆ ప్ర‌దేశంలో ఎన్నిఎలుక‌లు ఉన్నాయి. ఎలుక‌ల్ని చంపే యంత్రాలు ఏమైనా ఉన్నాయా..? ఎలుక‌ల్ని చంపేందుకు ఇచ్చిన కాంట్రాక్ట్ పై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ఎలుక‌ల పై డిమాండ్ వివాదం చెల‌రేగుతుంది. 
అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని చ‌ర్చించ‌కుండా ఎన్నిఎలుక‌లు చంపారు..? అనే అంశంపై చ‌ర్చించ‌డం ఏంట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. సీనియ‌ర్ బీజేపీ నేత , మ‌హ‌రాష్ట్ర మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖ‌డ్సే మంత్రాల‌యంలో ఎలుక‌ల్ని చంప‌డానికి ఇచ్చిన కాంట్రాక్ట్ పై విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. 
 ఏడు రోజుల్లో 3,19,400 ఎలుకలను కంపెనీ ఎలా చంపగలిగిందని ఆయన శాసనసభలో అడిగారు. మంత్రాలయలో 3,19,400 ఎలుకలున్నాయని సర్వేలో తెలిందని, సాధారణ పరిపాలన శాఖ వర్క్ ఆర్డర్ జారీ చేసిందని, కంపెనీకి ఆరు నెలల సమయం ఇచ్చారని, అయితే ఏడు రోజుల్లో ఆ ఎలుకలను చంపినట్లు తెలిపిందని ఆయన చెప్పారు.
  ఆయ‌న డిమాండ్ పై స్పందించిన బీజేపీ మంత్రి రామ్ క‌దం 3,19,400 అనే సంఖ్య మాత్రలకు సంబంధించిందని, ఎలుకలను చంపింది కాదని స్పష్టం చేశారు. 3,19,400 అనేది ఎలుకలను చంపే మాత్రలను చెప్పిన సంఖ్య అని ఆన చెప్పారు. ఎలుకలను లెక్కించడానికి యంత్రమేదీ లేదని కూడా చెప్పారు. రోజుకు 45 వేల ఎలుకలను చంపుతున్నారనే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని అన్నారు.  ఎలుకలను చంపే ఆ మాత్రలను ఒక్కొక్కటి రూ.1.50 చొప్పున 2010-11 కొన్నట్లు వివ‌ర‌ణిచ్చారు. 
 

English Title
Maharashtra: BJP minister says 3 lakh tablets used in Mantralaya, not 3 lakh rats killed

MORE FROM AUTHOR

RELATED ARTICLES