సర్దుబాట్లు... వడపోతలు... కూటమి... కుదుటపడేదెప్పుడు!!

సర్దుబాట్లు... వడపోతలు... కూటమి... కుదుటపడేదెప్పుడు!!
x
Highlights

మహాకూటమిలోని అన్ని పార్టీల కన్నా, అభ్యర్థుల వడపోతలో ఒక అడుగు ముందుంది టీటీడీపీ. ఇంటెలిజెన్స్ సర్వేలతో, గెలుపు గుర్రాలను అన్వేషించి, పార్టీ అధినేతతో...

మహాకూటమిలోని అన్ని పార్టీల కన్నా, అభ్యర్థుల వడపోతలో ఒక అడుగు ముందుంది టీటీడీపీ. ఇంటెలిజెన్స్ సర్వేలతో, గెలుపు గుర్రాలను అన్వేషించి, పార్టీ అధినేతతో ఆమోదముద్ర కూడా వేయించుకుంది. 19 మంది అభ్యర్థుల లిస్ట్‌ను, కాంగ్రెస్‌ ముందుంచింది. ఇంతకీ ఆ 19 మంది ఎవరు....ఎక్కడెక్కడ టికెట్లు ఆశిస్తోంది టీడీపీ. మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. ఏపార్టీకా పార్టీ, సీట్లను డిమాండ్ చేస్తుండటంతో, ఎవరికెన్ని సీట్లివ్వాలో, ఏయే స్థానాల్లో, తమకెన్ని మిగులుతాయో అర్థంకాక, కాంగ్రెస్‌ తలలు పట్టుకుంటోంది. ఇదే నేపథ్యంలో, తెలంగాణ తెలుగుదేశం మాత్రం, తమకు ఏయే సీట్లివ్వాలో మహాకూటమి ముందు ప్రతిపాదనలు పెట్టింది. సర్వేలు చేసి, సాధికారంగా ఎక్కడెక్కడ గెలుస్తామో చెబుతూ, ఒక జాబితాను కాంగ్రెస్ ముందుంచింది.

టిడిపి 30 స్ధానాలు కోరుతున్నప్పటికీ, 15 సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అంగీకరించినట్టు సమాచారం. కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్ధులు లేని సీట్లనే టీడీపీ కోరుతోంది. దీనికి సంబంధించి మొత్తం 19 నియోజ‌క‌వ‌ర్గాల అభ్యర్ధుల పేర్లను కాంగ్రెస్ పెద్దల ముందుంచింది. మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియ‌ర్లలంద‌రికి టికెట్లు ద‌క్కేలా, జాబితా రూపొందించింది. తెలుగుదేశం జాబితా, ఇప్పటికే కాంగ్రెస్ దగ్గరుంది. కానీ ప్రస్తుతం ఎలాంటి స్పందనాలేదు. కాంగ్రెస్‌ అధిష్టానానికి టీడీపీ అభ్యర్థుల పేర్లు, సర్వే వివరాలను అందించిన తర్వాత, హైకమాండ్ ఆదేశాలను బట్టి, సీట్లు కేటాయించాలని భావిస్తోంది టీపీసీసీ.

Show Full Article
Print Article
Next Story
More Stories