ఎన్టీఆర్ టీడీపీలోనే ఉండాలి: నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Sat, 03/31/2018 - 17:34
Madhavi Latha

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ వార్తల్లో నిలిచిన హీరోయిన్ మాధవీలత... మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈసారి జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జానాలకు మంచి చేయాలనే ఆలోచన ఎన్టీఆర్ కి తాతగారి నుంచి వచ్చి ఉండవచ్చని చెప్పింది. అతను తెలుగుదేశం పార్టీలోనే ఉండాలని తెలిపింది. ఎన్టీఆర్ చాలా మంచి వ్యక్తని, మంచి మాటకారి అని పేర్కొన్న మాధవి అతడిని ఎందుకు పక్కన పెట్టారో తనకు అర్థం కావడం లేదన్నారు. రాజకీయాల్లో యువత అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఒకసారి మాట్లాడడం మొదలుపెడితే ఇక ఆపడని, ధారాళంగా మాట్లాడుతూనే ఉంటాడని మాధవి కితాబిచ్చారు. గత ఎన్నికల్లో ఎన్టీఆర్ కనిపిస్తాడని భావించానని, కానీ ఏమైందో ఏమోనని ఆవేదన వ్యక్తం చేశారు. జనాలకి మంచి చేయాలన్న ఆలోచన అతడికి తాతగారి నుంచి వచ్చి ఉంటుందని మాధవి పేర్కొన్నారు. అయితే తన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, దీనిని రాజకీయం (వివాదం) చేయవద్దని కోరారు. మనసులో ఉన్న భావాలను బటయపెట్టాను తప్పితే తన వ్యాఖ్యలతో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని పేర్కొన్నారు. తాను చెప్పినందంతా పూర్తి వ్యక్తిగతమని పేర్కొన్నారు. తన ఫేస్‌బుక్ ఖాతాలో చేసిన ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.
 

English Title
Madhavi Latha About Politics Of Jr NTR , Sr NTR

MORE FROM AUTHOR

RELATED ARTICLES