పెద్దలను కాదని వెళుతూ.. ప్రేమజంట దుర్మరణం!

Submitted by nanireddy on Thu, 06/07/2018 - 07:37
lovers-died-chennai-road-accident

రోడ్డుప్రమాదంలో ప్రేమజంట దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం మేట్టుమంగళం వద్ద చోటుచేసుకుంది. షోళింగర్‌ ప్రాంతం అంబేడ్కర్‌ నగర్‌కు శరత్‌కుమార్‌(20), అరసనెల్లికుప్పం గ్రామానికి చెందిన జయప్రద(20) ఇద్దరూ ఆట్టుపాక్కంలోని డిగ్రీ  చదువుతున్నారు.  వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్ళిచేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ పెద్దలు వీరి పెళ్లికి అడ్డు చెప్పారు. దీంతో  ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకోవాలని మంగళవారం అర్ధరాత్రి  బైక్‌ పై బయలుదేరారు. మార్గంమధ్యలో నిర్మాణంలో ఉన్న కల్వర్టులో అదుపుతప్పి  బైక్ పడిపోయింది. దీంతో ప్రమాదం జరిగి ప్రేమికులిద్దరు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. వారు కుటుంబసభ్యులను పిలిచి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షోళింగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. 

English Title
lovers-died-chennai-road-accident

MORE FROM AUTHOR

RELATED ARTICLES