త్రిష‌ని అంత‌మంది ఫాలో అవుతున్నారు

త్రిష‌ని అంత‌మంది ఫాలో అవుతున్నారు
x
Highlights

'వ‌ర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా', 'అత‌డు', 'ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే' చిత్రాల‌తో తెలుగువారికి చేరువైన చెన్నై సుంద‌రి త్రిష‌. తెలుగుతో...

'వ‌ర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా', 'అత‌డు', 'ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే' చిత్రాల‌తో తెలుగువారికి చేరువైన చెన్నై సుంద‌రి త్రిష‌. తెలుగుతో పాటు త‌మిళంలోనూ స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఈ ముద్దుగుమ్మ‌.. 'నాయ‌కి' త‌రువాత మ‌ళ్లీ మ‌రో తెలుగు చిత్రానికి సంత‌కం చేయ‌లేదు. అయితే త‌మిళంలో మాత్రం అర‌డ‌జ‌ను చిత్రాల‌తో ఫుల్ బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే.. ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉండే ఈ సుంద‌రి.. తాజాగా 4మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌ని సొంతం చేసుకుంది. జులై 2009లో ట్విట్ట‌ర్ అకౌంట్‌లో చేరిన త్రిష‌..149 మందిని ఫాలో అవుతోంది. ఈ సంద‌ర్భంగా త‌న 4మిలియ‌న్ల ఫాలోవ‌ర్ల‌కి కృత‌జ్ఞ‌త‌లు చెప్పింది ఈ సొగ‌సరి.

Show Full Article
Print Article
Next Story
More Stories