వైసీపీలో కలకలం

వైసీపీలో కలకలం
x
Highlights

వైసీపీలో కలకలం మొదలైంది. నిన్నమొన్నటి వరకు నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడ్డ వైసీపీ మరోసారి ఇదే తరహ సమస్యని ఎదుర్కొనబోతుందని పొలికల్...

వైసీపీలో కలకలం మొదలైంది. నిన్నమొన్నటి వరకు నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడ్డ వైసీపీ మరోసారి ఇదే తరహ సమస్యని ఎదుర్కొనబోతుందని పొలికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గత ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. అయితే వైసీపీ లో చేరిన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు అదే కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే వరుస పరాభవాలతో ఉలిక్కిపడ్డ వైసీపీ నేతలు కర్నూలు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు రావడంలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఓ వైపు ఎన్నికల్లో ఓటమి, ఫిరాయింపులు ..మరో వైపు 2019 అసెంబ్లీ ఎన్నికలు జగన్ ను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ..ఆ జిల్లా పార్టీ నేతలతో అధినేత జగన్ భేటీ కానున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, గెలుపే లక్ష్యంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

ఇదిలా ఉంటే ఆ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 19న ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. 26 వరకు నామినేషన్లు స్వీకరణకు గడువు విధించారు. వచ్చే నెల 12న పోలింగ్‌, 16న కౌంటింగ్‌ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories