కేటీఆర్ మెచ్చిన రియ‌ల్ బాహుబ‌లి

కేటీఆర్ మెచ్చిన రియ‌ల్ బాహుబ‌లి
x
Highlights

రియ‌ల్ బాహుబ‌లిపై మంత్రి కేటీఆర్ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. అత‌నే నిజ‌మైన బాహుబ‌లి అంటూ కేటీఆర్ ఓ ఫోటోను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా...

రియ‌ల్ బాహుబ‌లిపై మంత్రి కేటీఆర్ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. అత‌నే నిజ‌మైన బాహుబ‌లి అంటూ కేటీఆర్ ఓ ఫోటోను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా పోస్ట్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. త‌మిళ‌నాడులో ఫారెస్ట్ గార్డుగా ప‌నిచేస్తున్న శ‌ర‌త్ కుమార్ హీరోయి అయిపోయాడు. విధులు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో ఓ ఏనుగు అడ‌విలోనుంచి జ‌నార‌ణ్యంలోకి వ‌చ్చింది. అయితే ఆ ఏనుగును అడ‌విలోకి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా పెద్ద గుంత‌లో ప‌డిఉన్న ఏనుగుపిల్ల క‌నిపించింది. స‌మాచారం అందుకున్న శ‌ర‌త్ కుమార్ ఆ ఏనుగుపిల్ల‌ను సుర‌క్షితంగా భ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నించాడు. తిండిలేక నీర‌సంగా ఉన్న ఆ ఏనుగుపిల్ల‌ను భుజాల‌పై మోసుకుని ఆస్ప‌త్రికి త‌ర‌లించాడు. దీంతో శ‌ర‌త్ పై అభినంద‌న‌న‌లు వెల్లువెత్తాయి. ఈ సంద‌ర్భంగా అందరూ తన కంటే బరువుగా ఉన్న ఏనుగు పిల్లను ఎలా మోసుకెళ్లావు అని ప్రశ్నిస్తున్నారని కుమార్‌ తెలిపాడు. తాజాగా ఈ ఫొటోపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘ఇతనే అసలైన బాహుబలి’అంటూ ఫొటోను పోస్ట్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories