కేటీఆర్ కు సభలో షాకిచ్చిన కవిత

Submitted by arun on Wed, 08/01/2018 - 16:58
ktr

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, టీఆర్‌ఎస్ ఎంపీ కవిత నిజామాబాద్ కలెక్టరేట్ పక్కన కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఎంపీ కవిత పాల్గొని అన్న కేటీఆర్‌కు కొన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో ఐటీ రంగం అంటే హైదరాబాద్ కే పరిమితమైందని ఇప్పుడు అన్ని జిల్లాలకు ఐటీ విస్తరిస్తున్నారని అన్నారు. ఐటీలో కొత్త ఆవిష్కరణలకు నిజామాబాద్ కేంద్రం కావాలని ఆమె ఆకాక్షించారు.

అయితే ఈ సందర్భంగా తన అన్నయ్య కేటీఆర్ ను అభివృద్ధిలో పక్షపాతం చూపవద్దంటూ ఇరికించారు. అన్నయ్య కేటీఆర్ దృష్టి ఎప్పుడూ తన ప్రాతినిధ్యం వహించే ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనే ఉంటుందని.. జర ఆ ప్రేమను చెల్లెలు ప్రాతినిధ్యం వహించే నిజామాబాద్ పైనా చూడాలని సభాముఖంగా కోరుతున్నానని విన్నవించింది. ఇలా బహిరంగ సభలో అభివృద్ధి విషయంలో అన్నయ్య కేటీఆర్ పక్షపాతం చూపిస్తాన్నడని అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అభివృద్ధి గురించే ఈ కోరిక కోరడంతో అందరూ కవిత సమయస్ఫూర్తితో కేటీఆర్ ను ఇరికించిందని వ్యాఖ్యానించారు.

English Title
ktr lay foundation stone for it hub in nizamabad

MORE FROM AUTHOR

RELATED ARTICLES