పింఛన్ కోసం తల్లి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచిన కొడుకు

Submitted by arun on Fri, 04/06/2018 - 12:35
Freezer Box

డబ్బుకు లోకం దాసోహం. ఇది ఊరికే చెప్పలేదు. ఎందుకంటే డబ్బే ప్రధానం అన్నింటికి. అన్ని బంధాలను నిలిపేది, పడగొట్టేది ఈ డబ్బే. దీనికి తార్కాణంగా నిలిచే ఘటన ఒకటి కోల్‌కతాలో చోటుచేసుకుంది. తల్లికి వచ్చే పెన్షన్‌ డబ్బుల కోసం ఆమె మరణాన్ని కూడా లోకానికి తెలియకుండా చేశాడు. తల్లి శవాన్ని ఇంట్లోని ఫ్రిజ్‌లోనే దాచిపెట్టారు. ఆమె కొడుకు, భర్త కలిసి ఈ పని చేశారు. తల్లికి వచ్చే పెన్షన్‌ డబ్బుల కోసం ఆమె బతికే ఉన్నట్లుగా సర్టిఫికేట్స్‌ కూడా సృష్టించాడు.ఈ అమానవీయ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో జరిగింది. రాబిన్‌సన్ వీధిలో నివసించే ప్రభుత్వ ఉద్యోగిని అయిన బీనా మజుందార్ ఆరోగ్య సమస్యలతో 2015 ఏప్రిల్ 7 న చనిపోయారు. లెదర్ టెక్నాలజీ నిపుణుడైన కుమారుడు సుభబ్రత తల్లి పింఛన్ పొందేందుకు దుష్టపన్నాగం పన్ని ఇంట్లోని ఫ్రీజర్ బాక్సులో మృతదేహాన్ని భద్రపరిచాడు. చుట్టుపక్కల వారికి ఆ ఇంట్లో నుంచి ఘాటైన వాసనలు రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగప్రవేశం చేసిన పోలీసులు బీనా మజుందార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ నిమిత్తం సుభబ్రతను అదుపులోకి తీసుకున్నారు. 

ప్రైవేట్ ఉద్యోగం నుంచి తొలగింపునకు గురై ఇంటివద్దనే ఉంటున్న సుభబ్రత కుటుంబపోషణకు తల్లి పింఛన్ పొందాలని పథకం వేశాడు. కొన్ని రసాయనాలు చల్లి మృతదేహాన్ని భద్రపరుస్తూ ఆమె వేలిముద్రలు తీసుకుంటూ గత మూడేండ్లుగా పింఛన్ తీసుకుంటున్నాడు. ఈ విషయం వృద్ధుడైన తండ్రి గోపాల్‌కు తెలిసినా భయంతో ఎవరికీ చెప్పలేదు అని పోలీసులు చెప్పారు. తల్లికి కర్మకాండ చేయకుండా మానవత్వానికి మచ్చ తెచ్చిన సుభబ్రతపై కేసు నమోదు చేసుకుని బెహాలా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Mazumdar

English Title
Kolkata Man Kept Dead Mothers Body in Freezer For 3 Years

MORE FROM AUTHOR

RELATED ARTICLES