కేరళలో ఆపరేషన్‌ గరుడ...ఒక సాహసం.. 26 మంది ప్రాణాలు

Submitted by arun on Tue, 08/21/2018 - 14:16

కేరళలో సహాయక బృందాలు చేస్తున్న సాహసాలు అన్నీ ఇన్నీ కాదు. ప్రాణాలకు తెగించి మరీ ఆపన్నులను కాపాడుతున్నారు. చలకుడ్డి నగరంలో ఓ నేవీ పైలెట్ చేసి సాహసం ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది. అత్యంత ధైర్యసాహసాలతో అంతకంటే సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఓ పైలెట్ 26 మంది ప్రాణాలు కాపాడాడు.

కేరళలో హెవీ రెస్క్యూ ఆపరేషన్..డేర్‌ డెవిల్‌లా వ్యవహరించిన నేవీ పైలెట్‌...కేరళలోని చలకుడ్డిలో నావికాదళానికి చెందిన పైలెట్ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. ఎవరూ చేయని విధంగా ఎవరూ ఊహింని విధంగా ఏకంగా ఓ ఇంటిపైకి హెలీకాఫ్టర్‌ను తీసుకెళ్ళి26 మందిని కాపాడాడు. వారిని రక్షించడమే కాదు తను కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 

వరద సహాయక చర్యల్లో భాగంగా ఓ యువ నేవీ పైలెట్ సీకింగ్‌ 42బీ హెలీకాప్టర్‌లో కోచి నుంచి రెండు జెమినీ బోట్లు, ఎనిమిది మంది గజ ఈతగాళ్లు, ఆహార పదార్థాలతో బయలుదేరాడు. చలకుడ్డిలో పడవలు, డైవర్లను దింపేసిన తరువాత ఆహార పొట్లాలను జార విడిచారు. తిరుగు ప్రయాణంలో రెండంతస్థుల ఇంటిపై కనిపించిన ఓ దృశ్యం చూసి ఆ పైలెట్‌ మనసు కరిగిపోయింది. హెలీకాప్టర్‌ను చూసి కొందరు వృద్ధులు, ఓ మహిళ డాబాపై నుంచి చేతులు ఊపడం చూసిన అతను ఏమాత్రం ఆలోచించ లేదు. వెంటనే డాబాపైకి హెలికాప్టర్‌ను దించి వారిని కాపాడాలనుకున్నాడు. 

అయితే పూర్తిగా హెలీకాప్టర్‌ డాబాపై దించితే దిగితే ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది. అనుకోనిది జరిగితే సెకన్లలోనే హెలికాప్టర్‌ కుప్ప కూలడం ఖాయం. పైగా హెలీకాఫ్టర్ కిందికి దిగే సమయంలో ఎత్తైన చెట్లకు రెక్కలు తగిలితే అంతే అది గాల్లోనే ముక్కలవవుతుంది. అందుకే ఆ యువ పైలెట్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. డాబాపైకి నేరుగా హెలీకాఫ్టర్‌ ను దించకుండా కొంచెం ఎత్తులో ఎగిరేలా చేశాడు. అలా హెలికాప్టర్‌ను దాదాపుగా డాబాపై దిగేలా చేసి, 8 నిమిషాల పాటు అక్కడే ఎగురుతూ ఉండేలా చేశాడు. అక్కడ ఉన్న నలుగుర్ని హెలీకాప్టర్‌కు ఉండే తొట్టె ద్వారా ఎక్కించారు. ఇది చూసి మరో 22 మంది రావడంతో వారిని కూడా చకచకా ఎక్కించేశాడు. డాబాపై నుంచి హెలీకాఫ్టర్ పైకి లేవడంతో ఆ పైలెట్ ఊపిరి పీల్చుకున్నాడు.

తర్వాత 26 మంది వరద బాధితుల్ని కోచిలోని నౌకాదళ కేంద్రమైన ఐఎన్‌ఎస్‌ గరుడకు తీసుకెళ్ళాడు. ఇంతకీ ఆ డేర్ డెవిల్ పైలెట్ పేరు లెఫ్టినెంట్‌ కమాండర్‌ అభిజీత్‌ గరుడ్‌. వయసు 33 ఏళ్లు. గరుడుడు అంటే సూక్ష్మ దృష్టికి, అద్భుత సాహసానికి మారుపేరు. ఇప్పుడు అభిజీత్‌ గరుడ్‌ కూడా తల్లిదండ్రులు పెట్టిన పేరుకు సార్థకం చేకూర్చాడు. ఇంటిపై హెలీకాఫ్టర్ దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పైలట్ అభిజీత్‌ గరుడ్‌ ధైర్య సాహసాలకు అందరూ ఫిదా అవుతున్నారు. 


 

English Title
Kerala floods: Daredevil pilot’s tightrope walk

MORE FROM AUTHOR

RELATED ARTICLES