సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికిన మమతా బెనర్జీ

Submitted by arun on Mon, 03/19/2018 - 15:44
kcr

బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. బెంగాల్‌ సెక్రటేరియట్‌కు వచ్చిన కేసీఆర్‌ అండ్‌ టీమ్‌కి మమతా సాదర స్వాగతం పలికారు. అనంతరం సెక్రటేరియట్‌లో మమతా బెనర్జీ, కేసీఆర్‌ సమావేశమయ్యారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యమని ప్రకటించిన కేసీఆర్‌‌ జాతీయ రాజకీయాలు, ఫ్రంట్‌ ఏర్పాటుపై మమతా బెనర్జీతో చర్చిస్తున్నారు. నాన్‌ బీజేపీ, నాన్‌ కాంగ్రెస్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు సహకరించాలని కోరనున్నారు.

 బీజేపీకి, మోడీకి వ్యతిరేకంగా టీడీపీ, వైసీపీలు కేంద్రంపై అవిశ్వాస యుద్ధం చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ కొత్త ఫ్రంట్‌ ఏర్పాటుకు మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్ దేశవ్యాప్త టూర్‌‌కి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ముందుగా బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ప్రాంతీయ పార్టీల అధినేతలను, బీజేపీ, కాంగ్రెస్‌ యేతర రాష్ట్రాల ము‌ఖ్యమంత్రులను కలవనున్నారు. 

English Title
kcr meets mamata banerjee

MORE FROM AUTHOR

RELATED ARTICLES