తుదిజాబితా వెల్లడించిన కేసీఆర్

Submitted by chandram on Sun, 11/18/2018 - 17:40

తీవ్ర కసరత్తు అనంతరం టీఆర్ఎస్ ఫైనల్ లిస్టు విడుదలయ్యింది. పార్టీ అధినేత కేసీఆర్‌ ఇద్దరు అభ్యర్థులతో తుది జాబితాను విడుదల చేశారు. ఇప్పటికే 117 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించడంతో తాజా ప్రకటనతో మొత్తం 119 మంది అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. కోదాడకు -బొల్లం మల్లయ్య యాదవ్ , ముషీరాబాద్‌ -ముఠా గోపాల్‌ ఖరార్.

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ కి ముందే, 107 మంది అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ మిగిలిన 12 స్థానాలపై తీవ్ర కసరత్తు చేసింది. వీటిలో పది మంది అభ్యర్థులతో టీఆర్ఎస్ మూడో జాబితాను ప్రకటించింది. మొదటి విడతలో 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఆ తర్వాత మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు, పది మందితో తాజా జాబితాను విడుదల చేశారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థుల సంఖ్య 117కు చేరుకుంది.మేడ్చల్ నుంచి చామకూర మల్లారెడ్డి, గోషామహల్ నుంచి ప్రేమ్ సింగ్ రాథోడ్, చార్మినార్ నుంచి మహమ్మద్ సలావుద్దీన్, వరంగల్ తూర్పు నుంచి నన్నపనేని నరేందర్, హుజూర్  నగర్ నుంచి శానంపూడి సైదిరెడ్డి, వికారాబాద్ నుంచి డాక్టర్ మెతుకు ఆనంద్, అంబర్ పేట నుంచి కాలేరు వెంకటేష్, మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హన్మంతరావు, చొప్పదండి నుంచి సొంకె  రవిశంకర్, ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ అభ్యర్థిత్వాలను కేసీఆర్ ఖరారు చేశారు. 

బర్కత్‌పురాలో రేపు జరిగే కార్యక్రమంలో నాయిని నర్సింహారెడ్డి చేతుల మీదుగా టీఆర్ఎస్ బిఫామ్‌ను ముషీరాబాద్ అభ్యర్థి ముఠా గోపాల్‌ అందుకోని అనంతరం నామినేషన్ దాఖలు. ఆపద్ధర్మ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్ రావు ఆధ్వర్యంలో కోదాడ అభ్యర్థిగా బొల్లం మల్లయ్య యాదవ్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. 

English Title
KCR Announces Candidates for Kodada, Musheerabad Constituencies

MORE FROM AUTHOR

RELATED ARTICLES