ఘోరం.. భార్య శవం పక్కన వారం రోజులు

Submitted by arun on Mon, 07/16/2018 - 12:14
Karnataka

కట్టుకున్న భార్య చనిపోతే  భార్య శవాన్ని ముట్టుకోలేదు భర్త. ఆచేతన స్థితిలో ఉన్న ఆయన పక్కవారికి  సమాచారం అందివ్వలేని నిస్సాహాయతతో భార్య శవం పక్కనే వారం రోజులు ఉన్నాడు. మనస్సును కదలించే ఈ ఘటన కర్ణాటకలోని కారవారలో చోటుచేసుకుంది. గిరిజ మడివాళ్‌ (42) గుండెపోటుతో మృతి చెందారు. ఆనంద్‌ అనారోగ్యం కారణంగా మంచానపడ్డాడు. పెరాలసిస్‌తో కదలేని స్థితిలో ఉన్న ఆయన ఏమీ చేయలేని స్థితిలో వారం రోజుల పాటు భార్య శవం పక్కనే ఉన్నాడు. కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆయనకు భార్యే సపర్యలు చేసేది. ఇళ్ల పనులు చేసే గిరిజ కొద్ది రోజులుగా రాకపోవడంతో ఆదివారం కొందరు వెతుక్కుంటూ ఆమె ఇంటికి వచ్చి చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే శవం కుళ్లిన స్థితికి చేరింది. ఆనంద్‌ కూడా కొన ఊపిరితో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు. 
 

English Title
Karnataka: Wife dies in front of paralysed man, help comes after seven days

MORE FROM AUTHOR

RELATED ARTICLES