పించన్ ఇవ్వడం లేదని కుష్టురోగి పాముతో ఆఫీసుకు వచ్చినవేళ...

Submitted by arun on Sat, 06/09/2018 - 12:54
snake

కర్ణాటక రాష్ట్రంలో ఓ కుష్ఠి రోగి తన సమస్యను వినూత్నంగా పరిష్కరించుకున్నాడు. గత 8 నెలలుగా తనకు పెన్షన్ రాకపోవడంతో మెడలో పామును వేసుకుని పెన్షన్ ఆఫీస్‌కు వెళ్లాడు. అధికారులకు దడ పుట్టించాడు. అనుకున్నది సాధించాడు. 

కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాను సాబా రాజేఖాన్ కుష్టురోగి. 68 ఏళ్ల రాజేఖాన్ కు గత ఎనిమిది నెలలుగా పించన్ ఇవ్వడం లేదు. పెన్షన్ కార్యాలయ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా వారు పించన్ విడుదల చేయకపోవడంతో ఆగ్రహించిన రాజేఖాన్ ఏకంగా ఓ పామును పట్టుకొని దాన్ని మెడలో వేసుకొని పెన్షన్ కార్యాలయానికి వచ్చాడు. రాజేఖాన్ పాము తీసుకొని రావడంతో కార్యాలయంలో ఉన్న సిబ్బంది అంతా భయంతో పారిపోయారు.

ఆఫీసులో ఉన్న ఓ అధికారిని కలిసిన రాజేఖాన్ పామును చూపించి బెదిరించి తనకు పించన్ ఇవ్వాలని అభ్యర్థించాడు. మూడు నాలుగు రోజుల్లో పెన్షన్ ఇస్తానని సదరు పించన్ కార్యాలయ అధికారి హామి ఇవ్వడంతో రాజేఖాన్ పామును సమీపంలోని అడవిలో వదిలేశారు. 8నెలలుగా పించన్ రాక ఇబ్బందులు పడుతున్న రాజేఖాన్ తన సమస్యను ఓ పాము సాయంతో పరిష్కరించుకున్నాడు. 

English Title
Karnataka: Man seeking pension brings snake to office

MORE FROM AUTHOR

RELATED ARTICLES