కర్నాటకలో కాలా మూవీ విడుదలకు లైన్ క్లియర్

Submitted by arun on Tue, 06/05/2018 - 16:40
kala

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కాలా మూవీ కర్ణాటకలో విడుదలకు లైన్‌ క్లియరైంది. సినిమా విడుదలకు కర్ణాటక హైకోర్టు అనుమతించింది. కావేరీ జలాలను తమిళనాడుకు కర్ణాటక విడుదల చేయాలంటూ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కన్నడ అనుకూల సంస్థలు కాలా విడుదలను అడ్డుకుంటామంటూ ప్రకటించాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు వెనక్కితగ్గారు. ఈ నేపథ్యంలో కాలా మూవీ విడుదలపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. సినిమా విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ...ఎలాంటి అవాంచనాలు కలకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆదేశించింది. థియేటర్ల వద్ద భద్రత ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానదేనని చెప్పింది. భారీ అంచనాల మధ్య రజనీ కాలా మూవీ ఈనెల 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

English Title
karnataka hc allows screening of kaala

MORE FROM AUTHOR

RELATED ARTICLES