ఎంపీగా పోటీ చేయనున్న కన్నయ్య కుమార్‌.. ఎక్కడినుంచంటే..

Submitted by nanireddy on Sun, 09/02/2018 - 20:41
kannaiah-kumar-contesting-next-lok-sabha-elections

ఢిల్లీలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థి నేత కన్నయ్య కుమార్‌ ఎంపీగా పోటీ చేయనున్నారు. ఈ విషయాన్నీ బిహార్‌ సీపీఐ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సింగ్‌ ప్రకటించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన స్వస్థలమైన బిహార్‌లోని బెగుసరై లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నట్లు అయన తెలిపారు. సీపీఐ నుంచి కన్నయ్య కుమార్‌ పోటీ చేస్తారని.. ఇప్పటికే వామపక్ష పార్టీలు ఈ నిర్ణయానికి సమ్మతం తెలిపినట్టు అయన వెల్లడించారు. కాగా కన్నయ్య కుమార్‌ బెగుసరై నియోజవర్గానికి చెందిన భీహాట్‌ గ్రామ పంచాయతీకి చెందినవాడు. గతంలో దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న ఆరోపణలతో ఆయనపై ఢిల్లీ పోలీసులు దేశ ద్రోహం కింద కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ వివాదం పెను సంచలనంగా మారింది.

English Title
kannaiah-kumar-contesting-next-lok-sabha-elections

MORE FROM AUTHOR

RELATED ARTICLES