ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కన్నా

Submitted by arun on Sat, 05/26/2018 - 12:17
kanna

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి కన్నా ల‌క్ష్మి నారాయణ బాధ్యతలు చేపట్టారు.  గుంటూరులో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు కంబంపాటి హరిబాబుతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తెచ్చే లక్ష్యంతో కార్యచరణ చేపట్టినట్టు కన్నా ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీపై  సీఎం చంద్రబాబు  తీవ్ర స్ధాయిలో దుష్ప్రచారం చేస్తున్నారని కన్నా ఆరోపించారు. సీఎం చంద్రబాబు చేతకానితనంతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదన్నారు.  ఏపీ ప్రజల నోట్ల మట్టి కొట్టిన దేవేగౌడను చంద్రబాబు కౌలిగించుకోవడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమంటూ కన్నా విమర్శించారు. 

English Title
kanna lakshmi narayana take charge bjp state president

MORE FROM AUTHOR

RELATED ARTICLES