గూగుల్ లో ఏది దొరికినా.. అదొక్కటి ’మనకు మనమే‘ తెలుసుకోవాలి అంటున్న కాజల్..!

Submitted by arun on Mon, 08/06/2018 - 17:04
kajal

ఇప్పుడు ఏ చిన్న డౌట్ వచ్చినా.. నెటిజనులందరూ జై గూగుల్ తల్లి అంటున్నారు. ప్రతీ చిన్న అంశాన్ని గూగుల్ లో శోధిస్తున్నారు. అయితే సెర్చింజిన్ గూగుల్ లో ఏది దొరకినా.. అదొక్కటి మాత్రం మనకు మనమే తెలుసుకోవాలి అంటున్నారు మిల్కీ బ్యూటి కాజల్. ఇంతకీ గూగుల్ లో దొరకనిది.. ఏంటది.. అంటే.. మంచి వ్యక్తిత్వం అంట. ఇటీవల గూగుల్ సెర్చింగ్ ఎక్కువైపోయింది. ఎంతలా అంటే... ఎవరైనా.. ఒక విషయంలో ఫేమస్ అయితే.. వెంటనే వారి నేపథ్యం ఏంటి? కులం, గోత్రం, ఏమైన ఎఫైర్స్ ఉన్నాయా? ఇలా ప్రతీ విషయాన్ని గూగుల్ లో శోధిస్తున్నారు. 

అయితే ఇలాంటి ధోరణిపై కాజల్ మొదటి సారిగా స్పందించారు. ‘గూగుల్ లో ఏది దొరికినా... మన వ్యక్తిత్వం ఏంటనేది మనకి మనమే తెలుసుకోవాలి.’ అంటున్నారు. ముఖ్యంగా మనకంటూ ఒక మంచి వ్యక్తిత్వాన్ని మనమే ఏర్పరుచుకోవాలి అంటూ సూచిస్తున్నారు. ‘ మంచి వ్యక్తిత్వం, గూగుల్ దొరకనిది అదొక్కటే. నువ్వేంటి? అనేది మాత్రం నువ్వు తెలుసుకోగలిగితే చాలు. మిగతా విషయాలన్నింటినీ గూగుల్ చేయొచ్చు.’ అంటూ బోధించారు. తెలుగు ఇండస్ట్రీలో పదేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్నారు కాజల్. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ తో రెండు చిత్రాల్లో, తమిళంలో ప్యారిస్ ప్యారిస్ అనే చిత్రంలో నటిస్తున్నారు.
 

English Title
kajal aggarwal talk about google

MORE FROM AUTHOR

RELATED ARTICLES