తెలుగు రాష్ట్రాల్లో ‘కాలా’ఫస్ట్ డే కలెక్షన్స్ !

Submitted by arun on Sat, 06/09/2018 - 13:27
kaala

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం "కాలా". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. కర్ణాటకలో మాత్రం ఈ చిత్రం వివాదంలో చిక్కుకుని పూర్తిస్థాయి విడుదలకు నోచుకోలేదు. అయితే, ఈ చిత్రం చెన్నై మహానగరంలో కలెక్షన్లపరంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కరికాలన్ దెబ్బకు గతంలో విడుద‌లైన త‌మిళ సినిమా రికార్డుల‌న్నీ బద్ధలైపోయాయి. సుమారు రెండేళ్లుగా తలైవా మూవీ కోసం ఎదురు చూస్తున్న చెన్నై ఫ్యాన్స్ ‘కాలా’ కళ్లుచెదిరే రికార్డ్‌ను అందించారు. చెన్నై సిటీలో తొలిరోజు రూ. 1.76 కోట్ల గ్రాస్ రాబట్టి తమిళ దలపతి విజయ్ ‘మెర్సల్’ పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. మెర్సల్ మూవీ చెన్నై సిటీలో తొలిరోజు రూ. 1.52 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ లెక్కన మెర్సల్ కంటే రూ. 24 లక్షల గ్రాస్ ఎక్కువ రాబట్టింది ‘కాలా’.

చెన్నైలో తొలిరోజు వసూళ్ల విషయంలో రికార్డును సృష్టించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లోను అదే జోరును చూపించింది.తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజున ఈ సినిమా 3.2కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరగడం ఖాయమని అంటున్నారు. రజనీ ఛరిష్మా .. నానా పటేకర్ నటనలో సహజత్వం .. హుమా ఖురేషి గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయని అంటున్నారు.

English Title
kaala 1st day box office collection

MORE FROM AUTHOR

RELATED ARTICLES