కాలేజీ అమ్మాయితో ఎమ్మెల్యే రాసలీలలు

Submitted by arun on Sat, 07/14/2018 - 13:12
bjpmla

‘ కట్టుకున్న భార్యను నేను వుండగానే ఆయన కాలేజీ చదువుతున్న 19 ఏళ్ళ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. ఆమెను రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు’ అంటూ ఓ ఎమ్మెల్యే భార్య జమ్మూ కాశ్మీర్‌లో తన భర్త యవ్వారాన్ని ప్రెస్‌మీట్ పెట్టి మరీ రచ్చకీడ్చింది. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు జీజేపీ ఆర్ఎస్ పుర నియోజకవర్గ ఎమ్మెల్యే గగన్. ఆమె పేరు మోనికా శర్మ. జమ్మూ బీజేపీ మహిళా విభాగానికి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. బీజేపీ అధిష్ఠానం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాల్సిందిగా మోనిక అభ్యర్థించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి.. ‘‘నేను మీ కుటుంబంలోని కుమార్తెగా భావించి న్యాయం కోసం అభ్యర్థిస్తున్నా. ఇది నా కోసమో, నా  పిల్లల కోసమో అడుగుతున్నది కాదు.. ఆ అమ్మాయి వయసు ఇంకా 19 ఏళ్లే’’ అని పేర్కొంది.

మోనిక ఆరోపణలను గగన్ ఖండించారు. తమ మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నట్టు తెలిపారు. తన నుంచి విడాకులు కావాలని ఆమె అడిగిందని, అయితే, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వద్దని వారించినట్టు చెప్పారు. అందుకే తనపై ఆరోపణలు చేస్తోందని అన్నారు. కాగా, ఈ వివాదంలో జోక్యం చేసుకున్న పార్టీ క్రమ శిక్షణ కమిటీ ఎదుట మోనిక, గగన్ హాజరయ్యారు. మరోవైపు తనపై కుట్ర జరుగుతోందని, ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకుంటానని గగన్ సవాలు విసిరారు.

జూలై నెలలో తన కూతురిని ఎమ్మెల్యే గగన్ కిడ్నాప్ చేశాడని పంజాబ్‌కు చెందిన ఓ మాజీ సైనికాధికారి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను రక్షించారు. అప్పుడా యువతి.. గగన్ చాలా మంచి వ్యక్తి అని చెప్పింది. తమ మధ్య అలాంటి సంబంధం లేదని తెలిపింది. ఇదిలా వుండగా  తనపై కుట్ర జరుగుతోందని.. ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని గగన్‌ చెబుతున్నారు.
 

English Title
jammu kashmir BJP mla illegal affair

MORE FROM AUTHOR

RELATED ARTICLES